చిన్నారుల భద్రతపై రాజీపడేది లేదు.. మెటా ఇండియా హెడ్‌కు బాలల హక్కుల కమిషన్ సమన్లు..
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్‌లలో బాలల భద్రతకు సంబంధించిన వ్యవహారంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలల లైంగిక వేధింపులు, దుర్వినియోగానికి సంబంధించిన సమాచారం ప్రచారమయ్యేలా ప్రకటనలు వెలువడుతున్నాయన్న ఆరోపణలపై కమిషన్ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, హెడ్‌ను వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. మెటాకు చెందిన ప్లాట్‌ఫామ్‌లలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌ను ప్రోత్సహించే…