Headlines

Upasana Konidela : ఆ గాయం నుంచి ఇంకా కోలుకుంటూనే ఉన్నా.. రెండో ప్రెగ్నెన్సీలో నరకం చూశాను.. ఉపాసన ఎమోషనల్..


ప్రముఖ పారిశ్రామికవేత్త, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన రెండో ప్రెగ్నేన్సీ ప్రయాణం, దానితో పాటు వచ్చిన మానసిక సవాళ్ల గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన రెండు గర్భధారణలలో తనకు అండగా నిలిచిన డాక్టర్ సుమన, డాక్టర్ నమితలకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాసన తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూనే, గర్భధారణ సమయంలో, ఆ తర్వాత తల్లులు ఎదుర్కొనే మానసిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించారు. మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ సుమన తన పట్ల చూపిన శ్రద్ధను ఉపాసన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తను లాస్ ఏంజిల్స్‌కు ప్రయాణిస్తున్నప్పుడు డాక్టర్ సుమన ఎంతో ఆందోళన పడ్డారని, తాను తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాతే ఆమె ఊపిరి పీల్చుకున్నారని పేర్కొన్నారు. అయితే, రెండో గర్భధారణ అనుభవం మాత్రం పూర్తిగా భిన్నంగా, ఎంతో కష్టంగా మారిందని ఉపాసన వెల్లడించారు. “నా రెండో ప్రెగ్నెన్సీ చాలా చాలా ప్రత్యేకమైనది. దాని గురించి ఇప్పుడు మాట్లాడటానికి నాకు చాలా కష్టంగా ఉంది. ఈ నవ్వుతున్న ముఖం వెనుక, ఇంకా గాయం నుండి కోలుకుంటున్న ఒక తల్లి ఉంది” అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ గాయం నుండి తను ఇంకా కోలుకుంటూనే ఉన్నానని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

ఈ ప్రయాణంలో తను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే తల్లిదండ్రులు తమ సమస్యలను తమలోనే దాచుకోకుండా బయటకు వచ్చి సహాయం కోరాలని ఆమె సూచించారు. గర్భధారణ కేవలం మూడు 9 నెలలు మాత్రమే కాదని, దానికి ముందు ప్రీ-ట్రైమెస్టర్ కూడా ఉంటుందని ఉపాసన స్పష్టం చేశారు. ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే ఆందోళన వేరే స్థాయిలో ఉంటుందని, అది సహజంగా ప్రయత్నిస్తున్నా లేదా ఫెర్టిలిటీ చికిత్స ద్వారా అయినా సరే, దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రెగ్నెన్సీ టెస్ట్, నెలసరి తప్పడం, అది ఒక వేడుక. కానీ ఆ సమయంలో మీకు పీరియడ్ వస్తే, మీ గుండె ఒక క్షణం ఆగిపోయినట్లు అనిపిస్తుంది,” అని ఆమె ఆనాటి మానసిక ఒత్తిడిని వివరించారు. గర్భధారణకు ముందున్న ఈ సమయం చాలా ఆందోళనకరంగా ఉంటుందని, బయట ఉన్న ఎంతో మంది మహిళలు కూడా ఇదే అనుభూతిని పొందుతారని ఆమె అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

అంతేకాకుండా, నాలుగో త్రైమాసికం ప్రాముఖ్యతను ఉపాసన తెలిపారు. ఇది అత్యంత ముఖ్యమైన త్రైమాసికాల్లో ఒకటని పేర్కొన్నారు. తన మొదటి ప్రెగ్నెన్సీకి ఇది లేనప్పటికీ, కవలలతో తన రెండో ప్రెగ్నెన్సీ తర్వాత ప్రసవానంతర డిప్రెషన్ (పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్) తనను దారుణంగా దెబ్బతీసిందని ఆమె వెల్లడించారు. “ఒక తల్లిగా నేను ఇంకా కోలుకుంటున్నాను” అని ఉపాసన ఎమోషనల్ అయ్యారు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన తన డాక్టర్లకు, తన మొత్తం బృందానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. చివరిగా, నాలుగో త్రైమాసికంలో తల్లులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి అవసరమైన మానసిక, శారీరక మద్దతును అందించాలని ఉపాసన కొణిదెల విజ్ఞప్తి చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *