Headlines

HYDలో స్వీట్ల ప్రియులకు బిగ్ షాక్.. స్వీట్లపై మెరిసేదంతా వెండి కాదు.. అల్యూమినియం!


హైదరాబాద్, నవంబర్‌ 18: హైదరాబాద్ నగరంలో స్వీట్ల ప్రియులకు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. స్వీట్లపై ఆకర్షణీయంగా కనిపించేందుకు వెండి పూత (సిల్వర్ వరఖ్) వేయడం సాధారణమే. అయితే కొందరు అక్రమార్కులు అసలైన వెండి పూతకు బదులుగా అల్యూమినియం కోటింగ్‌ను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ ముఠాలపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని చార్మినార్ కేంద్రంగా నకిలీ వెండి వరఖ్ తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. అసలైన వెండి పూత పేరుతో అల్యూమినియం రేకులతో తయారుచేసిన కోటింగ్‌ను స్వీట్లపై ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నకిలీ కోటింగ్‌ను నగరంలోని ప్రముఖ స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఈ అక్రమ తయారీపై పోలీసులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నకిలీ ముడిసరకును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 49 బండిళ్ల నకిలీ వెండి వరఖ్, 10 కిలోల అల్యూమినియం రేకులతో పాటు ఇతర ముడిసరుకు, తయారీకి ఉపయోగించే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి



ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. అక్రమ తయారీ, సరఫరాకు సంబంధించి నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. ఈ నకిలీ కోటింగ్ ఎక్కడెక్కడికి సరఫరా అవుతోంది? ఏయే స్వీట్ షాపుల్లో ఉపయోగిస్తున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. స్వీట్లపై మెరిసే వెండి పూత కనిపించిందని అది అసలైన వెండేనని భావించకూడదు. ఆహార పదార్థాలపై ఉపయోగించే పూతలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అల్యూమినియం రేకులను వెండి వరఖ్ పేరుతో ఉపయోగించడం వినియోగదారులను మోసం చేయడమే కాకుండా ఆహార భద్రతపై కూడా ఆందోళన కలిగిస్తోంది. పండుగలు, శుభకార్యాల సమయంలో స్వీట్ల కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పదంగా కనిపించే స్వీట్లను కొనకుండా, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చే విశ్వసనీయ దుకాణాల నుంచే కొనుగోలు చేయడం మంచిది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి అక్రమ వ్యాపారాలపై అధికారులు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *