Headlines

వామ్మో.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు చూపించిన గిరినాగు


అనకాపల్లి జిల్లాలోని కేజే పురంలో ఇటీవల జరిగిన ఒక సంఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. మసీదు వీధిలో భారీ కింగ్ కోబ్రా కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులు, ప్రసిద్ధ స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం అందించారు. పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగిన వెంకటేష్‌కు ఊహించని సవాలు ఎదురైంది. వేగంగా కదులుతూ, దాదాపు రెండు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టిన ఆ భారీ గిరినాగును పట్టుకోవడానికి ఆయన తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు, వెంకటేష్ దానిని సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కింగ్ కోబ్రా ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇతర పాముల్నే తన ప్రధాన ఆహారంగా చేసుకుంటుంది. అందుకే దీనిని పాముల్ని తినేది అని కూడా అంటారు. అంతేకాక, ఇది గుడ్లు పెట్టడానికి గూడు కట్టడం, తన పిల్లలను కాపాడుకోవడం వంటి అరుదైన ప్రవర్తనను కూడా ప్రదర్శిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *