Andhra Pradesh: ఏపీ పర్యాటకానికి సరికొత్త ఊపు.. గంటల ప్రయాణం ఇక నిమిషాల్లోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తుంది. పర్యాటక ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ.. జల మార్గంలో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సీ ప్లేన్ సేవలను ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రైవేట్ సంస్థల ప్రతిపాదనలకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. రాష్ట్రంలో విజయవాడ బెర్మ్ పార్క్, శ్రీశైలం, విశాఖపట్నం, తిరుపతి రాయలచెరువు, సూర్యలంక,…