విద్యార్థులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన స్కూల్ బస్సు..!
హైదరాబాద్: తెల్లాపూర్‌లోని మంథన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోకి విద్యార్థులు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పిల్లలను బస్సుకు దూరంగా తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకటో తరగతి విద్యార్థులు బస్సు ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే స్పందించి విద్యార్థులను సురక్షిత…