మహిళలు ఆభరణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగారం, వెండి లాంటివి కొనేందుకు ఇష్టపడతాయి.. అయితే.. ఇప్పుడున్న పరిస్థితులలో బంగారం కొనాలి అంటే భూములను అమ్ముకోవాల్సిందే.. బంగా ధరలు చూసి కొనుగోలు చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల కంటే అతి తక్కువ బంగారం రేట్లు ఉన్న ప్రాంతం ఒకటి ఉంది అదేంటో మీకు తెలుసా..? తెలియకపోతే ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకోండి..
కడప జిల్లాలో పసిడిపురిగా పిలవబడే ప్రాంతం ప్రొద్దుటూరు.. బంగారం వ్యాపారంలో బొంబాయి తర్వాత అంతటి వ్యాపారాన్ని చేసే ప్రాంతంగా పిలుస్తారు.. అందుకే.. రెండవ బొంబాయిగా పిలిచే ప్రొద్దుటూరు నగరం బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. బులియన్ రేట్లలో హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ , విజయవాడలతో పాటు ప్రొద్దుటూరు బులియన్ కూడా ప్రతిరోజు అందరూ పరిశీలిస్తూ ఉంటారు. సాధారణంగా పెద్దపెద్ద జ్యువెలరీ షాపులలో ఉండే డిస్కౌంట్ కంటే ప్రొద్దుటూరులో బంగారు ఆభరణాలు కొంటే తులంపై 6 నుంచి 7 వేల వరకు వ్యత్యాసం ఉంటుంది.
అందుకే శుభకార్యాలు ఏమైనా ఉంటే.. చుట్టుపక్కనున్న జిల్లాలే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ప్రొద్దుటూరులో బంగారు ఆభరణాలను కొంటూ ఉంటారు. చిన్నచిన్న ఆభరణాలకు రారు.. కానీ ఎక్కువ మొత్తంలో ఆభరణాలు కొనాలి అంటే మాత్రం ఖచ్చితంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి బంగారాన్ని కొనుగోలు చేస్తారు అంటే అతిశయోక్తి కాదు.. తులంపై ఆరేడు వేలు కలిసి వస్తుంది.. అందుకే ప్రొద్దుటూరులో బంగారం కొనుగోలుకు చాలామంది మక్కువ చూపుతారు.
ఈ రోజు జువెలరీ షాపులలో 22 క్యారెట్ల బంగారం ధర 1,41,900 ఉంటే ప్రొద్దుటూరులో అదే 22 క్యారెట్ల బంగారం ధర 1,36,320 ఉంది అంటే ఈ రోజే దాదాపు 5500 వ్యత్యాసం కనబడుతుంది. అంతేకాకుండా ప్రొద్దుటూరులో పెద్దపెద్ద జ్యువెలరీ షాపులలో దొరికే మోడల్స్ ను హ్యాండ్ మేడ్ తో తయారు చేసి ఇస్తారు. అంతటి నైపుణ్యం ఉన్న కళాకారులు ప్రొద్దుటూరులో ఉన్నారు. అందుకే ప్రొద్దుటూరు బంగారానికి ధర తక్కువ మన్నిక ఎక్కువ అంటారు. అంతేకాకుండా తరుగు విషయంలో కూడా జువెలరీ షాపుల కంటే ఇక్కడ తక్కువగానే ఉంటుంది. మేకింగ్ ఛార్జ్ కూడా తక్కువగానే తీసుకుంటారని వ్యాపారులు చెబుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..