Headlines

Astrology: అక్టోబర్ వరకు వీరికి తిరుగే ఉండదు..! ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సక్సెస్


Astrology: అక్టోబర్ వరకు వీరికి తిరుగే ఉండదు..! ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సక్సెస్

జ్యోతిషశాస్త్రం ప్రకారం శుభ గ్రహాలు ఒక రాశిలో ఉండడం ఎంత శుభప్రదమో, అవి కొన్ని రాశులను వీక్షించడం కూడా అంతే శుభప్రదం. శుభ గ్రహాలు సంచారం చేస్తున్న రాశులే కాక, అవి వీక్షిస్తున్న రాశులు కూడా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతాయి. ప్రస్తుతం కర్కాటకం, కన్య, తులా రాశుల్లో సంచారం చేస్తున్న గురు, బుధ, శుక్ర గ్రహాల వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులు ఇప్పటి నుంచి సుమారు అక్టోబర్ 31 వరకు అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నాయి. ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు, విదేశీయానాలు, ఆస్తి లాభాలు వంటివి తప్పకుండా కలిగే అవకాశం ఉంది.

మేషం

ఈ రాశిని సప్తమ స్థానంలో స్వస్థానంలో ఉన్న శుక్రుడు పూర్ణ దృష్టితో వీక్షించడం వల్ల కొద్ది ప్రయ త్నంతో ఈ రాశివారి మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వైవాహిక సమస్యలు పరిష్కారమై దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ది చెందు తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధనలాభం కలుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటకం

ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదు రుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశంఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విదేశీయానానికి అడ్డంకులు తొలగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగం లభిస్తుంది.

కన్య

రాశ్యధిపతి బుధుడు ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. విజయవంతమైన ఆర్థిక, వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావా దేవీలు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.

తుల

ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదరడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులే షన్లు, ఇతర ఆదాయ వృద్ధి మార్గాలు బాగా కలిసి వస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

వృశ్చికం

ఈ రాశిని కర్కాటక రాశి నుంచి ఉచ్ఛ గురువు పంచమ దృష్టితో వీక్షించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభదాయక వ్యవహారాలు, కార్యక్రమాలు చేపడతారు. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులతో పాటు ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడి స్తారు. వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది.

మకరం

ఈ రాశిని సప్తమంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వీక్షించడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతమవుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మీనం

ఈ రాశిని రాశ్యధిపతి గురువు ఉచ్ఛస్థితి నుంచి నవమ దృష్టితోనూ, కన్యా రాశి నుంచి బుధుడు సప్తమ దృష్టితోనూ వీక్షించడం వల్ల అపార ధన లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదం అనుకూ లంగా పరిష్కారమవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కనకవర్షం కురిపిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *