Headlines

మాదాపూర్‌లో మహా మత్తు దందా..వాట్సాప్ ఆర్డర్లు.. ర్యాపిడో డెలివరీలతో..

హైదరాబాద్ ఐటీ కారిడార్ కేంద్రంగా నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 1762 సమీపంలోని “ది స్మోక్ షాప్” పై ఈగల్ టీమ్ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్, పాడ్స్, కార్ట్రిడ్జ్‌లు మరియు నికోటిన్ పౌచ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాప్‌లో తనిఖీలు చేపట్టి అక్కడ పని చేస్తున్న కేరళకు చెందిన అబూబకర్ సిద్దీక్ అనే…

Read Full News

Cancer Warning Signs: కారణం లేకుండా బరువు తగ్గుతున్నారా? ముక్కు నుంచి రక్తం వస్తోందా? జాగ్రత్త!

క్యాన్సర్ వంటి వ్యాధుల్లో ప్రారంభ దశలో లక్షణాలు చాలా స్వల్పంగా ఉండే అవకాశం ఉందని వైద్య రంగంలో అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఈ లక్షణాలు కనిపించాయంటే క్యాన్సర్ ఉందని అర్థం కాదు. ఇతర అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఇదే విధమైన లక్షణాలను కలిగించవచ్చు. అందుకే స్వయంగా ఒక నిర్ధారణకు రాకుండా, లక్షణాలు కొనసాగితే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఇప్పుడు తరచుగా నిర్లక్ష్యం చేసే ఆరు ముఖ్యమైన సంకేతాలు ఏంటో తెలుసుకుందాం. 1. కారణం లేకుండా…

Read Full News

Bigg Boss 10: ఇదేం ట్విస్ట్‌.. బిగ్‌బాస్ హౌస్ గోడ దూకి బయటకు పారిపోయిన కంటెస్టెంట్.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ కొత్త సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఒకేసారి ఈ రియాలిటీ షో గ్రాండ లాంఛ్ జరిగింది. ఇక తెలుగులో అయితే సీజన్ 10 లాంఛ్ గ్రాండ్ గా జరిగింది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. కాగా తెలుగులో లాగే తమిళంలోనూ సీజన్ 10 గ్రాండ్ గా ప్రారంభమైంది. విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా తమిళంలో మొదటి…

Read Full News

కాఫీ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ఇలా తీసుకున్నారంటే.. మీ లివర్ భద్రంగా ఉన్నట్లే..!

మన శరీరంలో కాలేయం అత్యంత కీలకమైన అవయవం. శరీరం నుండి వ్యర్థాలను, విషపదార్థాలను బయటకు పంపడంలో, జీర్ణక్రియను వేగవంతం చేయడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే నేటి జీవనశైలి, అసమతుల్య ఆహార అలవాట్లు, ఆల్కహాల్ సేవనం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతిరోజూ మనం తాగే కాఫీ కాలేయ ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని పలు అంతర్జాతీయ వైద్య పరిశోధనలు…

Read Full News

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు, రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది

మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ABC ప్రింటింగ్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ABC ప్రింటింగ్ పరిశ్రమ కావడం, లోపల భారీగా పెయింట్లు, కెమికల్స్, ద్రవపదార్థాలు మరియు కాగితపు నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు పరిశ్రమ అంతటా విస్తరించి, ఆకాశాన్ని తాకేలా దట్టమైన పొగలు ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన పరిశ్రమ…

Read Full News

మద్యం మత్తు.. స్నేహితుల మధ్య చిచ్చు.. యువకుడిపై యాసిడ్‌ దాడి, పరిస్థితి విషమం!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. స్నేహితులతో కలిసి మద్యం తాగిన అనంతరం చోటుచేసుకున్న ఘర్షణలో, ఓ యువకుడిపై రసాయన ద్రవం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్డుకు చెందిన…

Read Full News

Traffic Challan: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్ చలానాలపై భారీ డిస్కౌంట్.. పెండింగ్ చలాన్లు క్లియర్!

Traffic Challan: ఈ రోజుల్లో ట్రాఫిక్ నియమాలు కఠినతరం అయ్యాయి. ఫలితంగా, తెలిసి గానీ తెలియక గానీ ఇ-చలాన్ జారీ కావడం సర్వసాధారణమైపోయింది. కొన్నిసార్లు దాని మొత్తం చాలా ఎక్కువగా ఉండటంతో ప్రజలు దానిని చెల్లించడానికి సంకోచిస్తారు. కాలక్రమేణా ఈ మొత్తం పెరుగుతూ, చట్టపరమైన చిక్కులకు దారితీస్తుంది. మీ వాహనంపై చెల్లించని చలాన్ ఉన్నట్లయితే, మీకు ఒక ముఖ్యమైన ఉపశమన వార్త ఉంది. సెప్టెంబర్ 12, 2026న, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కోర్టులలో ఒక ప్రత్యేక…

Read Full News

నందూస్ వరల్డ్ ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే నిజాలు.. అంతా ఆయనే చేశాడన్న రమానందన..! ఊహించని ట్విస్ట్

‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా.. లక్షలాది మందికి సుపరిచితమైన యూట్యూబర్ రామ నందనకు ఊహించని షాక్ తగిలింది. లండన్ వీసాలు, ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌లో అడుగుపెట్టడమే ఆలస్యం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లండన్ లైఫ్‌స్టైల్ వీడియోలతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్ నందన అలియాస్ రమానందన.. మొత్తానికి పోలీసులకు దొరికిపోయారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్…

Read Full News

Hero Suhas: సినిమా షూటింగ్ ఏమోగానీ చావు అంచుల వరకు వెళ్ళొచ్చా : సుహాస్

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో దూసుకుపోతున్న యంగ్ హీరో సుహాస్, ఇప్పుడు మండాడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో, తన సినిమా అనుభవాలను, ముఖ్యంగా సముద్రంలో షూటింగ్ అలాగే అక్కడ ఎదురుకున్న సవాళ్లను పంచుకున్నారు. మండాడి టైటిల్ వెనుక ఉన్న కథను సుహాస్ వివరించారు. రామేశ్వరం సమీపంలోని తొండి అనే గ్రామంలో జరిగే బోట్ రేసుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ…

Read Full News

నేపాల్‌లో మృతదేహాలను పసిగట్టి అద్భుతాలు చేస్తున్న ‘రాకీ’, ‘జంబో’!

జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ రెండు జాగిలాలు.. మనుషులు వెళ్లలేని ఇరుకైన ప్రాంతాలు, ప్రమాదకర శిథిలాల మధ్యలోకి వెళ్లి మృతదేహాల వాసన పసిగట్టి గుర్తిస్తున్నాయి. విపత్తు సంభవించిన మొదటి రోజు నుంచీ రసువా జిల్లాలోని తైమూర్, ఘటికోలా ప్రాంతాల్లో మోహరించిన ఈ శునకాలు, ఇప్పటివరకు  26 మృతదేహాలతో పాటు కొన్ని శరీర భాగాలను వెలికితీయడంలో సహాయక బృందాలకు సహకరించాయి.  రాఖీ, జంబోతో పాటు కాఠ్‌మాండూ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ‘లియో’, ‘కలు’  లాబ్రడార్ శునకాలను మృతదేహాల…

Read Full News