తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో దూసుకుపోతున్న యంగ్ హీరో సుహాస్, ఇప్పుడు మండాడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో, తన సినిమా అనుభవాలను, ముఖ్యంగా సముద్రంలో షూటింగ్ అలాగే అక్కడ ఎదురుకున్న సవాళ్లను పంచుకున్నారు. మండాడి టైటిల్ వెనుక ఉన్న కథను సుహాస్ వివరించారు. రామేశ్వరం సమీపంలోని తొండి అనే గ్రామంలో జరిగే బోట్ రేసుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ బోట్ రేసుల్లో జట్టును నడిపించే కెప్టెన్‌ను స్థానికంగా మండాడి అని పిలుస్తారని తెలిపారు సుహాస్. ఇది ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన పదం అని, చెన్నైలో కూడా చాలా మందికి దీని గురించి తెలియదని ఆయన అన్నారు. కథ ప్రధానంగా రెండు టీమ్స్ మధ్య జరిగే బోట్ రేసుల చుట్టూ తిరుగుతుందని, ఈ రేసులు చాలా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పారు. ఒడ్డున జరిగే కథ కూడా అంతే బాగుంటుందని, సత్యరాజ్, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారని, ప్రతి పాత్రకు బలమైన బ్యాక్ స్టోరీ ఉంటుందని సుహాస్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.
మండాడి చిత్రంలో సుహాస్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. హిట్ సిరీస్‌లో నెగటివ్ టచ్ ఉన్న పాత్రను పోషించినప్పటికీ, మండాడిలో మొదటి నుంచి చివరి వరకు పూర్తి స్థాయి క్రూరమైన షేడ్స్‌తో కూడిన పాత్ర అని అన్నారు. అన్ని రకాల పాత్రలు చేయాలనే కోరికతోనే ఈ విలన్ పాత్రను అంగీకరించానని, హీరోగా మాత్రమే ఉండిపోవాలనే ఆకాంక్ష లేదని సుహాస్ స్పష్టం చేశారు. ఫ్యామిలీ డ్రామా సినిమాలో సైకో పాత్ర చూసే ఈ అవకాశం వచ్చిందని, ఈ విలన్ పాత్రను చాలా రోజుల తర్వాత చేయడం వల్ల ఎక్కువగా ఎంజాయ్ చేశానని తెలిపారు.
అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్
ఈ సినిమా షూటింగ్ కోసం సుమారు 130 రోజులు పని చేశానని. ఇందులో 45 రోజులు క్లైమాక్స్ కోసమే, 17 రోజులు ఇంటర్వెల్ సన్నివేశాల కోసం కేటాయించారు. ఈ సినిమాలో అత్యంత సవాలుతో కూడుకున్నది సముద్రంలో చేసిన షూటింగ్. సుహాస్ స్వయంగా 74 రోజులు సముద్రంలోనే గడిపారట. ప్రతి రోజు ఉదయం సముద్రంలోకి వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చేవారట. తినడం, ఇతర పనులు అక్కడే జరిగేవని తెలిపారు సుహాస్. 10-15 కిలోమీటర్ల దూరం సముద్రం మధ్యలోకి వెళ్లి చిత్రీకరణ జరిపేవారమని, ఆ ప్రాంతంలో సముద్రం “నెక్స్ట్ లెవెల్ రఫ్ సీ” అని వివరించారు. అలలు తీవ్రంగా ఉండటంతో భయమేసిందని, చాలాసార్లు చావు నుంచి తప్పించుకున్నామని సుహాస్ వెల్లడించారు. “గాలి ఎక్కువ ఉన్నప్పుడు పడవలు బోల్తా పడిపోయేవి. అప్పుడు మేము కరెక్ట్‌గా దూకాలి, లేకపోతే పడవ మీద పడిపోతుంది” అని తెలిపారు. అంతేకాకుండా, పడవలు ఒకదానికొకటి ఢీ కొట్టడం, పెద్ద కర్రలు వచ్చి గుద్దుకోవడం, వేగంగా తిరిగే తాడులు తగలడం వంటి ప్రమాదకర సంఘటనలు చాలా జరిగాయని గుర్తు చేసుకున్నారు. ఈ కష్టమైన షూట్‌లో తానొక్కడినే కాకుండా, DOP, దర్శకుడు, ఇతర బృందం సభ్యులు కూడా చావు అంచు వరకు వెళ్లి వచ్చారని చెప్పారు. మండాడి సెప్టెంబర్ 10వ తేదీన విడుదలవుతుందని, ప్రేక్షకులు విజువల్ ట్రీట్‌ను ఎంజాయ్ చేస్తారని, కథకు తప్పకుండా మంచి పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సుహాస్.
Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.