నేపాల్‌లో మృతదేహాలను పసిగట్టి అద్భుతాలు చేస్తున్న ‘రాకీ’, ‘జంబో’!
జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ రెండు జాగిలాలు.. మనుషులు వెళ్లలేని ఇరుకైన ప్రాంతాలు, ప్రమాదకర శిథిలాల మధ్యలోకి వెళ్లి మృతదేహాల వాసన పసిగట్టి గుర్తిస్తున్నాయి. విపత్తు సంభవించిన మొదటి రోజు నుంచీ రసువా జిల్లాలోని తైమూర్, ఘటికోలా ప్రాంతాల్లో మోహరించిన ఈ శునకాలు, ఇప్పటివరకు 26 మృతదేహాలతో పాటు కొన్ని శరీర భాగాలను వెలికితీయడంలో సహాయక బృందాలకు సహకరించాయి. రాఖీ, జంబోతో పాటు కాఠ్‌మాండూ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ‘లియో’, ‘కలు’ లాబ్రడార్ శునకాలను మృతదేహాల…