బిన్ లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా సీఐఏ..
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ ఒకప్పుడు భారత్‌పై కూడా ఉగ్ర దాడులు చేయాలని కుట్ర పన్నినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇటీవల బయటపెట్టిన రహస్య పత్రాల్లో ఈ దిగ్భ్రాంతికర వివరాలు వెల్లడయ్యాయి. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన 9/11 ఉగ్ర దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, బిన్ లాడెన్‌కు సంబంధించిన 70కి…