ఏపీలో ‘మిషన్ మార్చి’.. ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
అమరావతి, సెప్టెంబర్ 13: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాల కలెక్టర్లు ‘మిషన్ మార్చి’ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాల భవనాల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన…