Headlines

ర్యాపిడో, ఓలా , ఊబర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!


క్యాబ్ సేవలు అందించే ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లైన ఓలా, ఊబర్, ర్యాపిడోలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైడ్ బుకింగ్‌కు ముందే వినియోగదారుల నుంచి ముందస్తుగా టిప్ వసూలు చేసే అడ్వాన్స్ ఫీచర్ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది. యాప్ ఓపెన్ చేసినప్పుడు ఒక రేటు చూపించి, ఆ తర్వాత టిప్ పేరుతో మరో రేటు చూపించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే వెల్లడించారు. టిప్ యాడ్ చేయకపోతే డ్రైవర్లు రైడ్స్ యాక్సెప్ట్ చేయట్లేదని, ప్రయాణికులు బలవంతంగా డబ్బులు చెల్లించేలా ఒత్తిడికి గురవుతున్నారని పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. టిప్ ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా వినియోగదారుల వ్యక్తిగత ఇష్టమని, సర్వీస్ నచ్చితే వాళ్లే స్వచ్ఛందంగా ఇస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్స్ టిప్పింగ్ వసూలు చేస్తున్న ర్యాపిడో మాతృ సంస్థ ‘రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్’పై సీసీపీఏ (CCPA) ఏకంగా రూ.10 లక్షల జరిమానా విధించింది. రైడ్ త్వరగా బుక్ అవ్వాలంటూ అదనపు డబ్బులు వసూలు చేసే ఈ విధానం ‘డార్క్ ప్యాటర్న్’ కిందకు వస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం ఓలా, ఊబర్‌లలోని అడ్వాన్స్ టిప్పింగ్ మరియు డైనమిక్ ప్రైసింగ్ విధానాలపై కూడా తీవ్ర స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇకపై అన్ని క్యాబ్ అగ్రిగేటర్లు 2023 డార్క్ ప్యాటర్న్ నిబంధనలకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశవ్యాప్తంగా పనీర్‌ బ్యాన్‌! 5 వేల లైసెన్సులు రద్దు!

UPI కొత్త నిబంధనలు.. సామాన్యులపై ప్రభావం ఎంత?

Nirmala Seetharaman: ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్‌

రూ.10 లక్షల లంచం + రోజూ బిర్యానీ = ఏసీబీ షాక్!

నొప్పి తగ్గించే ఇంజెక్షన్, కిక్కిచ్చే మత్తుమందుగా మారిందా ?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *