Life Lesson: రోజుకో చిన్న అడుగు.. మీ జీవితాన్నే మార్చే కన్సిస్టెన్సీ పవర్ ఇదే!
కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నప్పుడు లేదా మోటివేషనల్ వీడియో చూసినప్పుడు మనలో ఉత్సాహం పెరుగుతుంది. వెంటనే జీవితాన్ని మార్చేయాలనిపిస్తుంది. కానీ ఆ ఉత్సాహం కొద్దిరోజుల్లో తగ్గిపోతుంది. అప్పుడు మనసు సాకులు వెతకడం మొదలుపెడుతుంది. ‘ఈరోజు వద్దులే.. రేపటి నుంచి చేద్దాం’అనే ఆలోచన అక్కడే మొదలవుతుంది. ఇలా ప్రతిసారి మనం మనకు ఇచ్చుకున్న మాటను తప్పుతుంటే, మనపై మనకున్న నమ్మకం కూడా క్రమంగా తగ్గిపోతుంది. అందుకే ఒకరోజు భారీగా పనిచేయడం కంటే.. ప్రతిరోజూ కొద్దిగా పనిచేయడం చాలా ముఖ్యం….