మొట్టమొదటిది, కీళ్ళ సందుల్లో జిగురు పెరగాలంటే వ్యాయామం తప్పనిసరి. కదలికల వల్ల ఉత్పత్తి అయ్యే వేడిని చల్లార్చడానికి, రాపిడిని తగ్గించడానికి శరీరం సహజంగా జిగురును స్రవిస్తుంది. కాళ్ళు కదపకుండా కూర్చుంటే జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది. మోకాళ్ళపై భారం పడకుండా చేసే వ్యాయామాలు జిగురును పెంచుతాయి. కుర్చీలో కూర్చుని కాళ్ళను నేలకు ఆనకుండా పైకి లేపి, బిగించి, దించటం, మంచంపై పడుకుని గాలిలో సైకిల్ తొక్కడం, కాళ్ళను మడిచి చాచడం వంటివి సులభమైన వ్యాయామాలు. ఇవి కండరాలను బలపరిచి, జాయింట్లను లూబ్రికెంట్ చేస్తాయి.