Indian Railways: రాబోయే దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణలోని చర్లపల్లి నుండి తమిళనాడులోని నాగర్‌కోయిల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రైళ్ల వివరాలు, సమయాలు:
- రైలు నంబర్ 07535 (చర్లపల్లి – నాగర్‌కోయిల్):
- ఇది ప్రతి శుక్రవారం నడిచే తేదీలు: సెప్టెంబర్ 25, 2026 నుండి అక్టోబర్ 23, 2026 వరకు. అయితే ఈ రైలు మొత్తం 5 ట్రిప్పులు నడుస్తుంది.
రైలు నంబర్ 07536 (నాగర్‌కోయిల్ – చర్లపల్లి):
ఇది ప్రతి ఆదివారం నడుస్తుంది. తేదీలు: సెప్టెంబర్ 27, 2026 నుండి అక్టోబర్ 25, 2026 వరకు నడుస్తుంది. అయితే మొత్తం 5 ట్రిప్పులు నడుస్తుంది.
- రైలు ఆగే స్టేషన్లు (హాల్ట్‌లు):
- ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి:
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్: నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట.
- తమిళనాడు: చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, వృద్ధాచలం, తిరుచిరాపల్లి, దిండిగల్, మధురై, విరుదునగర్, సాత్తూర్, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్.
కోచ్‌ల వివరాలు:
ఈ పండుగ ప్రత్యేక రైళ్లలో 2nd AC (AC II Tier), 3rd AC (AC III Tier), స్లీపర్ క్లాస్ (Sleeper Class), జనరల్ సెకండ్ క్లాస్ (General Second Class) కోచ్‌లను అందుబాటులో ఉంచారు.పండుగ వేళల్లో స్వగ్రామాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
ఇవి కూడా చదవండి

Railways