మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నావేంటక్కా.. అంత చిన్న విషయానికే ఇంత రియాక్ట్ అవ్వాలా?
ఆన్ లైన్ పేమెంట్స్ కొన్ని సార్లు గందరగోళానికి దారి తీస్తున్నాయి. నెట్ సరిగా లేకపోవడం, ట్రాన్స్ ఫర్ చేసిన వెంటనే ఆ మొత్తం ఖాతాల్లో జమకాకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి ఘర్షణే ఇద్దరి ఆడవాళ్ల మధ్య జరిగి ఏకంగా కత్తెరతో ఒకరిపై మరొకరు దాడి చేసి పరిస్థితికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలోని గురవయ్య కాలనీలో అరుంధతి అనే మహిళ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తుంది. డెబ్బై ఏళ్ల వయస్సున్న ఆమె…