India Women vs Bangladesh Women, Semi Final 1: మహిళల ఆసియా కప్ తొలి సెమీ-ఫైనల్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. గత ఎనిమిది మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌పై భారత్ అజేయంగా నిలిచింది. బంగ్లాదేశ్ చివరిసారిగా 2023 జులై 13న భారత్‌ను ఓడించింది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 24 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగ్గా, వాటిలో భారత్ 21 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
అగ్రస్థానంలో భారత్..
ఆడిన 3 మ్యాచ్‌లలోనూ గెలిచి, థాయ్‌లాండ్‌ను 94 పరుగుల తేడాతో, హాంగ్‌కాంగ్‌ను 137 పరుగుల తేడాతో, పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్, ఆరు పాయింట్లతో గ్రూప్ ఎలో అగ్రస్థానంలో నిలిచింది.
బంగ్లాదేశ్ 4 పాయింట్లతో గ్రూప్ బిలో రెండవ స్థానంలో నిలిచింది. ఇండోనేషియాను 71 పరుగుల తేడాతో, యూఏఈని 34 పరుగుల తేడాతో ఓడించగా, శ్రీలంక చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
వాళ్లకు అనుకూలిస్తే చివరి ఓవర్లలో పరుగులు చేయడం కష్టమే..
దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ గ్రూప్ దశలో ఇప్పటివరకు జరిగిన 12 మ్యాచ్‌లలో, భారత్ మాత్రమే రెండుసార్లు 150కి పైగా పరుగులు చేసింది. పవర్‌ప్లేలో పరుగులు వేగంగా నమోదయ్యాయి. కానీ, చివరి ఓవర్లలో స్కోరింగ్ వేగం మందగించింది. వేడి, తేమ కారణంగా పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారింది.
12 మ్యాచ్‌లలో ఎనిమిదింటిని మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలుచుకోగా, తొమ్మిది సార్లు టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..