Headlines

జిడ్డు పట్టిన టీ జాలిని కొత్తదానిలా మెరిపించే చిట్కాలు.. నల్లటి మరకలు చిటికెలో మాయం!

రోజూ టీ వడపోసే జాలి పైన పేరుకుపోయే టీ పొడి మరకలు, నలుపును వదిలించడం సాధారణ సోప్‌తో కష్టం. అయితే కొన్ని సులభమైన గృహ చిట్కాలతో టీ జాలిని కొత్తదానిలా మెరిపించవచ్చు. ఈ చిట్కాలు పాటించడం వల్ల జాలి శుభ్రపడటమే కాకుండా బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. టీ జాలిని సులభంగా శుభ్రం చేసే పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం.. 1. స్టవ్ మంటపై కాల్చే పద్ధతి (స్టీల్ జాలి కోసం మాత్రమే): మీ దగ్గర ఉన్నది స్టీల్ టీ…

Read Full News

హైదరాబాద్‌ DRDOలో రీసెర్చ్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షల్లో జీతం

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌ (RCI).. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మిసైల్‌ కాంప్లెక్స్‌లో భాగమైన RCIలో రీసెర్చ్ అసోసియేట్ (RA), జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) తాత్కాలిక పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది…..

Read Full News

Match Fixing: పాకిస్థాన్ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ప్లేయర్ల ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పీసీబీ

Match Fixing: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు ఏడుగురు ఆటగాళ్లను, కోచ్‌ను జట్టు నుంచి తొలగించిన పీసీబీ ఇప్పుడు ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలకు తావిస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీసుకుంటున్న వింత నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇంగ్లాండ్‌తో కీలకమైన ఆఖరి టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జాతీయ…

Read Full News

Gold Rates: ఏకంగా రూ.3 వేలకుపైగా తగ్గిన బంగారం.. కొనుగోలు చేసేవారికి జాక్‌పాట్..

గత వారంలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతకముందు వారం కూడా పడిపోగా.. గత వారం కూడా మరోసారి డౌన్ అయ్యాయి. దీంతో గోల్డ్ ప్రియులకు గత రెండు వారాలుగా ధరలు ఊరట కల్పిస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు గత వారంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. వారం ప్రారంభంలో పతనమవ్వగా.. మధ్యలో కాస్త పుంజుకున్నాయి. వారం చివరినాటికి మళ్లీ…

Read Full News

Rain Alert: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌!

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదిలిక చురుగ్గా ఉందని.. వీటి ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది వాతవారణ శాఖ. వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, బిహార్,…

Read Full News

తెలుగు అక్షరాలతో అద్భుత పట్టు చీర.. సిరిసిల్ల కళాకారుడి వినూత్న ఆలోచనకు జేజేలు!

తెలుగు భాషపై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల జగదీష్. చేనేత మగ్గంపై నూలుతో ఎన్నో రకాల డిజైన్లను ఆవిష్కరించే ఆయన.. ఈసారి తెలుగు భాషలోని అక్షరాలనే చీరకు అందమైన డిజైన్లుగా మలిచారు. ఏకంగా 56 తెలుగు అక్షరమాలను పట్టు చీరపై కళాత్మకంగా డిజైన్ చేసి, తెలుగు భాషకు చేనేత కళ ద్వారా నీరాజనం పలికారు. సాధారణంగా పట్టు చీరలపై పూలు, ఆకులు, నెమళ్లు, సంప్రదాయ డిజైన్లు,…

Read Full News

Bigg Boss 10 Telugu: రైతు సింపతి వాడుతున్నావా.. ? ట్రోల్స్‏కు ఇచ్చిపడేసిన సింగర్ ఝాన్సీ..

బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో అట్టహాసంగా జరగనుంది. అయితే ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ టికెట్ అందుకుంది సింగర్ ఝాన్సీ. ఈ క్రమంలోనే తాజాగా టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన బిగ్ బాస్ ప్రయాణం, లక్ష్యాలపై మాట్లాడారు. “బిగ్ బాస్ ఎందుకు?” అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, “కొన్ని కోట్ల మందికి పరిచయం అవ్వాలని ఈ బిగ్ బాస్…

Read Full News

కొడుకు చనిపోయాడనీ అంత్యక్రియలు.. నెల రోజుల తర్వాత ఊహించని ఫోన్ కాల్! దెబ్బకు అంతా షాక్

కపుర్తలా, సెప్టెంబర్ 6: పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన రవి కుమార్ అనే యువకుడు ఆగస్టు 5న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఎన్ని రోజులు వెదికినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రవి తండ్రి, సోదరుడు అతడి కోసం బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు. వివిధ ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీంతో చివరకు ఆగస్టు 11న కపుర్తలా సిటీ పోలీస్…

Read Full News

Viral Video: రాత్రి పూట పొదల్లోంచి అదే పనిగా శబ్ధాలు.. ఏంటని టార్చ్ వేసి చూడగా..

ఖమ్మం జిల్లాలో ఓ భారీ కొండచిలువ సంచారం తీవ్ర కలకలం రేపింది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ రోడ్ నెంబర్ 5లో కొందరు మహిళలు నలుడుచుకుంటూ వెళ్తుండగా భారీ కొండచిలువ వారి కంటపడింది. కాలనీ మధ్యలోకి సుమారు 15 అడుగుల కొండచిలువను చూసిన స్థానికలు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఆ తర్వాత స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే స్నేక్ క్యాచర్ సూర్య, తన సహాయకుడు మద్దుతో…

Read Full News

పగలు ఆర్‌ఎంపీ డాక్టర్‌.. రాత్రయితే..

పగటిపూట తెల్లకోటు వేసుకొని వైద్యం చేస్తాడు. రాత్రయితే మాత్రం ఇతగాడి కథే వేరుగా ఉంటుంది. డాక్టర్ ముసుగులో అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాడి బాగోతం బట్టబయలైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం దూసరిపాము గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాకు చెందిన మడగల శ్రీనివాస్ అనే యువకుడు స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. వైద్యుడిగా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా గ్రామంలో అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఇదే…

Read Full News