
ఆన్ లైన్ పేమెంట్స్ కొన్ని సార్లు గందరగోళానికి దారి తీస్తున్నాయి. నెట్ సరిగా లేకపోవడం, ట్రాన్స్ ఫర్ చేసిన వెంటనే ఆ మొత్తం ఖాతాల్లో జమకాకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి ఘర్షణే ఇద్దరి ఆడవాళ్ల మధ్య జరిగి ఏకంగా కత్తెరతో ఒకరిపై మరొకరు దాడి చేసి పరిస్థితికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలోని గురవయ్య కాలనీలో అరుంధతి అనే మహిళ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తుంది. డెబ్బై ఏళ్ల వయస్సున్న ఆమె ఏన్నో ఏళ్లుగా ఈ దుకాణాన్ని నడుపుతుంది. అయితే నిన్న మధ్యాహ్న సమయంలో అరుంధతి షాపుకు అదే కాలనీలో నివాసం ఉండే ప్రియాంక అనే యువతి వచ్చింది. షాపులో బట్టలు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కొనుగోలు చేసిన మొత్తాన్ని ఆన్ లైన్ పేమెంట్ చేసినట్లు అరుంధతికి చెప్పింది.
అయితే డబ్బులు వచ్చాయ లేదా అని అరుంధతి ఆన్ లైన్‌లో చెక్ చేసుకోగా ఆ మొత్తం కనిపించలేదు. దీంతో అరుంధతి ప్రియాంకతో డబ్బులు రాలేదని చెప్పింది. కానీ ప్రియాంక మాత్రం నేను అప్పుడే పంపాను అంటూ చెప్పింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. మాటా మాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రియాంక అక్కడే టెబుల్‌పై బట్టలు కడ్‌చేసే కత్తెర తీసుకొని అరుంధతిపై దాడి చేసింది. ఈ దాడిలో మెడపై, చేతిపై తీవ్ర గాయాలవ్వడంతో అరుంధతి గట్టిగా కేకలు వేసింది.
అమె కేకలు విని వెంటనే అక్కడి చేరుకున్న స్థానికువు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అరుంధతి షాపు వద్దకు చేరుకున్న పోలీసులు. రక్తపు మడుగులో ఉన్న అరుంధతిని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో వైద్యం అందించడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రియాంక పొంతన లేని మాటలు చెబుతుండటంతో ఆమెను పిఎస్ కు తరలించి ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.