Headlines

rajeshchukka117@gmail.com

Asia Cup 2026: 44 పరుగులకే 5 వికెట్లు పడినా అద్భుత విజయం.. సెమీస్‌కు చేరిన లంక.. సస్పెన్స్‌లో పాక్

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తర్వాత సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిలో పడింది. కెప్టెన్ చమారి అటాపట్టు…

Read Full News

వైట్ క్యాబేజీ vs రెడ్ క్యాబేజీ.. ఆరోగ్యానికి అసలు ఏది బెస్ట్..?

క్యాబేజీలో పోషకాలే కీలకం..: కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వివిధ పోషకాలు అందుతాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, క్యాల్షియం వంటి పోషకాలు మన రోజువారీ ఆహారంలో అవసరం. క్యాబేజీ కూడా ఈ పోషకాలను అందించే కూరగాయల్లో ఒకటిగా పరిగణిస్తారు. Source link

Read Full News

Telangana: పంది మాసం కోసం భార్య ప్రాణం తీసిన భర్త.. అసలు ఏం జరిగిందంటే?

ఇష్టమైన ఆహారం విషయంలో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కారింగు లింగయ్య, లింగమ్మ దంపతులు కూలి నాలి చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వారికి వివాహాలు కావడంతో అత్తారింటికి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. లింగమ్మ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నడిపించడంలో భర్తకు సహకరిస్తోంది. అయితే లింగయ్యకు పంది…

Read Full News

ఆ హీరో అద్భుతమైన నటుడు.. సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు కానీ ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు..

ఓ ఇంటర్వ్యూలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తన సినీ ప్రయాణం గురించి, పలువురు నటీనటులు, దర్శకులతో తన అనుభవాల గురించి విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటి అవికా గోర్ గురించి ఆయన చెప్పిన విషయాలు ఆకట్టుకున్నాయి.  రాజేంద్రప్రసాద్ గారితో భూలోకం టు యమలోకం సినిమాకు పనిచేసిన అనుభవాలను వేణుగోపాల్ గుర్తుచేసుకున్నారు. రాజేంద్రప్రసాద్ ఒక లెజెండరీ నటుడని, ఆయన అంకితభావం అద్భుతమని కొనియాడారు. మార్నింగ్ 5 గంటలకే వచ్చి,…

Read Full News

Ind Vs Pak: మళ్లీ మొదలుకానున్న భారత్ పాక్ క్రికెట్ పోరు?.. బీసీసీఐ నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ!

Ind Vs Pak: ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడే భారత్ పాకిస్థాన్ జట్లు ఇకపై ప్రత్యేక బహుళ దేశాల సిరీస్‌లో తలపడే అవకాశం కనిపిస్తోంది. తటస్థ వేదికలపై మూడు లేదా నాలుగు జట్లతో ఈ టోర్నీ నిర్వహించే అంశంపై ఐసీసీ సుదీర్ఘంగా ఆలోచిస్తోంది. రాజకీయ ఉద్రిక్తతల కారణం చేత 2012-13 సీజన్ నుంచి భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది క్రికెట్…

Read Full News

Viral Video: రాత్రి ఇంటికెళ్తుండగా ఎదురైన చిరుత పులి.. కార్మికులు తెలివిగా ఏం చేశారంటే?

నల్గొండ జిల్లాలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. పీఏ పల్లి మండలం చిలకమర్రి స్టేజి వద్ద చిరుత కదలికలను గుర్తించారు AKBR వద్ద పనిచేస్తున్న కార్మికులు.  వారు పనులు ముగించుకొని వాహనంలో ఇంటికి బయల్దేరగా.. మార్గమధ్యలో చిలకమర్రి స్టేజ్‌ వద్ద వారికి ఓ చిరుతపులి ఎదురైంది. దాన్ని చూసి మొదట కంగారుపడిన కార్మికులు.. వాహనాన్ని పక్కకు ఆపి తమ మొబైల్‌లో చిరుత దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం వాహనం హారన్ కొట్టడంతో ఆ చిరుత అక్కడి నుంచి…

Read Full News

ఓయో రూమ్ నుంచి బయటికి రాని యువకుడు.. సిబ్బంది వెళ్లి చూడగా..

హైదరాబాద్‌ ఉప్పల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తనను మోసం చేసిందనే మనస్తాపంతో 26 ఏళ్ల యువకుడు ఓయో హోటల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వారసిగూడకు చెందిన చుక్క హేమంత్‌ సాగర్‌ (26) ఉప్పల్‌లోని NSL ఎరినా టవర్‌లో ఉన్న Foundever కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హేమంత్‌ శనివారం సాయంత్రం ఉప్పల్‌లోని ఎస్ఎల్ఎన్ గ్రాండ్ ఓయో హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం వరకు గది నుంచి బయటకు రాకపోవడంతో…

Read Full News

NHAI: నేషనల్ హైవేపై వెళుతున్నారా..? ఒక్క ఫొటో పంపితే నేరుగా అకౌంట్లోకి రూ.వెయ్యి ఫ్రీ.. కేంద్రం సూపర్ ఛాన్స్..

ప్రయాణికులకు నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా(NHAI) శుభవార్త అందించింది. రూ.వెయ్యి ఫాస్టాగ్ రీఛార్జ్ ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక క్యాంపెయిన్ ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. మీరు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటే ఉచితంగా రూ.వెయ్యి ఫాస్టాగ్ రీఛార్జ్ పొందవచ్చు. మీరు చేయాల్సింది పెద్ద కష్టమైన పని కూడా కాదు. జస్ట్ ఒక్క చిన్న పని చేస్తే ఈ రివార్డ్ మీ సొంతమవుతుంది. క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ పేరుతో ఓ ప్రత్యేక క్యాంపెయిన్‌ను కేంద్రం…

Read Full News

ఇంటర్‌ మార్కులతో నేరుగా అంగన్‌వాడీ టీచర్‌ ఉద్యోగాలు.. సెప్టెంబర్‌ 10 వరకే అవకాశం!

తెలంగాణలోని మహిళలు, నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 125 అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు…

Read Full News

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి నుంచి వారం రోజుల పాటు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో 174 ప్రకారమే లబ్ధిదారుల అర్హతను గుర్తించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుల నుంచి వచ్చిన దరఖాస్తున్నలు పూర్తిగా పరిశీలించి అర్హులైన వారికి కేటగిరీల వారీగా ఫించన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. ఈ దరఖాస్తు ప్రక్రియను నేటి నుంచి స్టార్ట్ చేసి 20…

Read Full News