నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. 2029లోగా వరుసగా మరో మూడు DSC నోటిఫికేషన్‌లు
అమరావతి, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. 2029లోగా రాష్ట్రంలో మరో మూడు డీఎస్సీ (District Selection Committee) నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏటా డీఎస్సీ నిర్వహించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొని మాట్లాడారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు తమ…