Headlines

క్రేజీగా కమల్‌ లైనప్‌… షూటింగ్‌ స్టేటసేంటి?

లోకనాయకుడు కమల్ హాసన్ అనూహ్యమైన వేగంతో వరుస సినిమాలను ప్రకటిస్తూ కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా దూసుకుపోతున్నారు. ఆయన ప్రాజెక్టుల జాబితా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఈ సినిమాల షూటింగ్ అప్డేట్స్‌పై మాత్రం సరైన స్పష్టత కొరవడుతోంది.తన 234వ చిత్రంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ సినిమా భారీ అంచనాలను అందుకున్నప్పటికీ, ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత కమల్ చేయబోయే ప్రాజెక్టుల విషయంలో గందరగోళం నెలకొంది. యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పేరున్న అంబు…

Read Full News

ఆ సీఐ నోటి దురుసు! వృద్ధ మహిళపై అసభ్యకర పదజాలం.. వైరల్‌గా మారిన వీడియో

బాపట్ల జిల్లా చీరాల టూటౌన్ సీఐ శశికుమార్ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తూ ఓ ఇంటి బయట వృద్ధురాలితో అసభ్యంగా ప్రవర్తించడం, దూషించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. సీసీ కెమెరాలో నమోదైన ఈ దశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌చల్‌ చేస్తున్నాయి. చట్టప్రకారం, నైతికంగా ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామ్‌నగర్‌లో తాజాగా చోటుచేసుకున్న ఘటన పోలీసు శాఖ ప్రతిష్టపై…

Read Full News

గణేష్ చతుర్థి.. తప్పక దర్శించాల్సిన 5 ప్రసిద్ధ గణపతి పండళ్లు.. కోర్కెలు తీర్చే దేవుడు!

గణేశుడు ఆటంకాలను తొలగించేవాడని, ఆయనను పూజిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ సంవత్సరం, గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భారతదేశంలోని ప్రసిద్ధ గణపతి పండల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆధ్యాత్మికత, సంస్కృతి, కళా నైపుణ్యం కొలువైన ఈ 5 ప్రసిద్ధ పండళ్లను ప్రతీ ఒక్కరూ తప్పక దర్శించాలి. లాల్‌బాగ్ చా రాజా (ముంబై): ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన గణపతి పండల్ ఇది. 1934లో స్థాపించబడిన…

Read Full News

అబ్బబ్బ.. ప్రయోజనాలు తెలిసి బొప్పాయిని తెగ లాగించేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

బొప్పాయి పండు దాని రుచి, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చాలామందికి నచ్చిన పండు. ఇది మన శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలతో నిండి ఉంటుంది, దీనిని తరచుగా “ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్” అని పిలుస్తారు. బొప్పాయిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఉదయం అల్పాహారం తీసుకోలేని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ డీ తగిన…

Read Full News

మగావాళ్లు జేబులో చిన్న దువ్వెన ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..? సైకాలజీ ప్రకారం వారి క్యారెక్టర్ ఎలాంటిదంటే..

చాలామంది పురుషులు జేబులో వాలెట్, ఫోన్‌తో పాటు ఎప్పుడూ ఒక చిన్న దువ్వెనను తమ దగ్గర ఉంచుకుంటారు. చూడటానికి ఇది కేవలం ఒక సాధారణ వ్యక్తిగత శుభ్రత అలవాటుగా అనిపించినప్పటికీ, దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైకాలజీ ఉందని నిపుణులు చెబుతున్నారు. సైకాలజిస్ట్ జాన్ నెజ్లెక్ నివేదికల ప్రకారం ఈ అలవాటు వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. సెల్ఫ్-ప్రెజెంటేషన్, ఆత్మవిశ్వాసం: సైకాలజీ ప్రకారం.. జేబులో ఎప్పుడూ దువ్వెన ఉంచుకునే పురుషులు తమ రూపం, ఇతరుల…

Read Full News

‘మరణానికి అనుమతి ఇవ్వండి’ అంటూ.. 74 ఏళ్ల వృద్ధుడి కన్నీటి లేఖ..!

ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి.. ఇప్పుడు న్యాయం కోసం తలుపులు తడుతున్న వృద్ధుడు. ఒకప్పుడు అన్నదమ్ములు.. ఇప్పుడు ఆస్తి కోసం ఆరోపణలు, ఫిర్యాదులు. 74 ఏళ్ల వయసులోనూ సమస్యకు పరిష్కారం దొరకక చివరకు విజయవాడ TV9 కార్యాలయానికి వచ్చారు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి సి. రాజన్‌బాబు. నాకు న్యాయం చేయండి.. లేదంటే ప్రాణం తీసుకునేందుకు అనుమతి ఇప్పించండి అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. రాజన్‌బాబు తోపాటు ముగ్గురు అన్నదమ్ములకు 1987లో…

Read Full News

Tollywood: తనకంటే 18 ఏళ్ల చిన్నవాడితో రొమాన్స్.. ముందు రిజెక్ట్ చేసిన హీరోయిన్.. థియేటర్లను షేక్ చేసిన సినిమా..

హిందీ చిత్రపరిశ్రమలో సరికొత్త సంచలనం సృష్టించిన సినిమా ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించిన దిల్ చాహతా హై. ఈ కల్ట్ క్లాసికల్ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తైనప్పటికీ ఈ మూవీ పట్ల సినీ ప్రియుల క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇందులో ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నా, ప్రీతి జింటా, సోనాలి కులకర్ణి , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలు పోషించారు. స్నేహం , ప్రేమ గురించి కొత్త పాఠాలను నేర్పుతూ, యువతరానికి ఎప్పటికీ…

Read Full News

ప్రభాస్‌కు కన్ఫ్యూజన్.. ఎలా తేల్చుకుంటారో ఏమో..?

ప్రభాస్ చేతి నిండా సినిమాలు, భారీ బడ్జెట్లు, అగ్ర దర్శకులతో బిజీగా ఉన్నారు. అయితే, ఈ భారీ చిత్రాల మధ్య సమన్వయం చేసుకోవడంలో ఆయనకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఫౌజీ మరియు స్పిరిట్ చిత్రాల విషయంలో ఈ సందిగ్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం. ప్రభాస్ ఫోకస్ అంతా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ఫౌజీపైనే ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్…

Read Full News

మాస్ కమ్‌బ్యాక్.. చరిత్ర సృష్టించిన ఆ నలుగురు

కమ్‌బ్యాక్ అంటే ఎలా ఉండాలో 2024లో నలుగురు హీరోలు రుజువు చేశారు. కెరీర్ ముగిసిందని విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించేలా, బాక్సాఫీస్ వద్ద స్టామినా లేదన్న వారికి రికార్డుల మోతతో సమాధానం ఇచ్చారు. సౌత్ నుండి నార్త్ వరకు ఈ నలుగురు తారలు అదిరి పోయే కమ్‌ బ్యాక్‌లతోలతో చరిత్ర సృష్టించారు. రవితేజ కెరీర్ ఖతం అనుకున్న వాళ్లకు ఇరుముడి చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లతో అదీరిపోయే ఆన్సర్ ఇచ్చింది. అరడజను ఫ్లాపుల తర్వాత…

Read Full News

మల్టీప్లెక్స్.. పాత పంచాయితీ కొత్తగా షురూ..!

ఇండస్ట్రీలో ఓటీటీ (ఓవర్-ది-టాప్) వర్సెస్ మల్టీప్లెక్స్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ఓటీటీ విండో వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలు విడుదలైన రెండు మూడు వారాలకే థియేటర్లలో ఆదరణ తగ్గుతున్నప్పుడు, నాలుగు వారాలకు ఓటీటీలోకి ఎందుకు ఇవ్వకూడదు అనేది నిర్మాతల వాదన. అయితే, ప్రేక్షకులు నెల రోజుల్లో ఓటీటీలో వస్తుందని భావించి థియేటర్లకు రావడం మానేస్తున్నారని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కౌంటర్ ఇస్తున్నాయి.బాలీవుడ్‌లో సినిమాలు థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. ఈ…

Read Full News