ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం

ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం


మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్–లెబనాన్ దేశాలు తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపిన ప్రకారం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌తో జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 2:30 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. 10 రోజుల పాటు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉండనుంది.

ఇక మరోవైపు, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీటే హెగ్సెత్ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. టెహ్రాన్ ఒప్పందానికి ముందుకు రాకపోతే, అమెరికా సైన్యం మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతపై కీలక ప్రభావం చూపే అవకాశముంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *