కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్‌తో పనిలేదు డ్యూడ్!
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన 20 ఏళ్ల సురేందర్ సింగ్ చౌదరి అలియాస్ బిట్టూ తబాహి సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. స్థానికంగా ప్రవహించే అజ్నార్ నది ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యకూపంగా మారడాన్ని చూసిన బిట్టూ, డిగ్రీ చదువుతూనే దాన్ని తిరిగి జీవనదిగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సాయం లేకుండానే, ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఒంటరిగా నది శుభ్రతను ప్రారంభించాడు. బిట్టూ అంకితభావాన్ని మెచ్చుకున్న కొందరు స్థానిక స్నేహితులు అతనికి తోడయ్యారు….