Headlines

Jabardasth : నువ్వా .. మా పక్కన కూర్చోకు.. చాలా అవమానించారు.. జబర్దస్త్ నటుడి ఆవేదన..

ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ శాంతి స్వరూప్ తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన అవమానాలను, బాధాకరమైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రధానంగా లేడీ గెటప్‌ల కారణంగా సాటి కళాకారుల నుంచే తాను ఎలా కించపరచబడ్డాడో ఆయన వివరించారు. ఈ సంభాషణ టెలివిజన్ పరిశ్రమలో కళాకారులు ఎదుర్కొనే అంతర్గత సవాళ్లను వెలుగులోకి తెచ్చింది. శాంతి స్వరూప్ మాటల్లో, “ఏయ్, మీరు లేడీ గెటప్ పక్కన కూర్చోకండి,” “మాతో ఫోటోలు దిక్కండి” వంటి మాటలు తనను ఎంతగానో బాధించాయని తెలిపారు….

Read Full News

పిల్లల గొంతుతో ఫోన్.. తల్లిదండ్రులే టార్గెట్‌గా డీప్‌ఫేక్ మోసం! ఈ జాగ్రత్తలు తీసుకోండి..

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని ఉపయోగించి వృద్ధులను టార్గెట్ చేస్తున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లల గొంతును పోలిన స్వరంతో ఫోన్ చేసి.. ప్రమాదం జరిగిందని, పోలీసుల అదుపులో ఉన్నామని లేదా ఆసుపత్రిలో ఉన్నామని చెప్పి అత్యవసరంగా డబ్బులు పంపించాలని మోసగాళ్లు ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని సెకన్ల ఆడియోతోనే గొంతు క్లోన్ సోషల్ మీడియా వీడియోలు, యూట్యూబ్ క్లిప్పులు, వాట్సాప్ స్టేటస్‌లు, ఇతర ఆన్‌లైన్…

Read Full News

ఫ్లైట్‌లో ఎన్ని లీటర్ల మద్యం తీసుకెళ్లొచ్చు..? ఈ తప్పులు చేస్తే చిక్కులు తప్పవు..

గోవా టూర్ ముగించుకుని తిరిగొస్తూ అక్కడి ఫేమస్ ఫెనీ, వైన్ లేదా నచ్చిన బ్రాండ్ విస్కీని తెచ్చుకోవాలనుకుంటున్నారా? లేదా విదేశాల నుంచి వస్తూ కనెక్టింగ్ డొమెస్టిక్ ఫ్లైట్‌లో మీ ఊరికి మద్యం తీసుకెళ్తున్నారా? అయితే విమానాల్లో మద్యం రవాణాకు సంబంధించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్దేశించిన కఠిన నిబంధనలపై అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం. నిబంధనలు తెలియక చాలామంది ఎయిర్‌పోర్టులలో సెక్యూరిటీ చెకింగ్ వద్ద చేదు అనుభవాలను…

Read Full News

Telangana Assembly: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. తాతా మధు వ్యాఖ్యలపై సభలో కీలక చర్చ..

తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. తొలిరోజు అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ సభ్యులు నల్ల చొక్కాలు వేసుకుని రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయమే పోలీసులు తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారిని నారాయణగూడ పీఎస్‌కు…

Read Full News

రెండు రోజులు ఇది పూస్తే చాలు.. చేతి, కాలి గోళ్ల ఫంగస్‎ మటుమాయం.. నిర్లక్ష్యం చేస్తే నష్టమే

కాలి, చేతి గోళ్ల చుట్టూ నొప్పితో నిద్ర సరిగా పట్టడం లేదా? గోళ్ల ఫంగస్ తో పాదాలు అందంగా లేవని బాధ పడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవసరం లేదు. దీనికోసం ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతోనే చెక్ పెట్టొచ్చు. మరి , లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. సాధారణంగా మనలో చాలా మందికి చేతి, కాలి గోర్లపై ఫంగల్ సమస్య వస్తుంది. ఈ సమస్యను మొదట్లోనే తుంచేయాలి లేదంటే…

Read Full News

Vaibhav Sooryavanshi: “ఈషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!”.. వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక

Vaibhav Sooryavanshi: చెన్నై వేదికగా సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కిషన్ 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 270 పరుగులు సాధించాడు. ఈస్ట్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల కొండంత స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఈస్ట్ జోన్ వైపు నుంచి డబుల్…

Read Full News

iPhone Fold: ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్‌పై బిగ్ అప్‌డేట్.. చరిత్రలోనే యాపిల్ సంచలన ప్రయోగం..

ఎన్నో ఏళ్లుగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త పరిణామం త్వరలోనే నిజం కానుందా? ఐఫోన్ సంప్రదాయ రూపురేఖలను సమూలంగా మారుస్తూ యాపిల్ సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుందా అంటే.. టెక్ వర్గాల నుంచి అవును అనే బలమైన సంకేతాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 9న జరగనున్న యాపిల్ వార్షిక మెగా ఈవెంట్ సర్ప్రైజ్ అండ్ షైన్ వేదికగా ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌లతో పాటు ఈ సంచలన ఐఫోన్ ఫోల్డ్‌ను…

Read Full News

NEET UG 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో MBBS సీట్లు పెరిగాయ్.. MCC కీలక అప్‌డేట్

హైదరాబాద్‌, సెప్టెంబర్ 8: నీట్ యూజీ 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో మెడికల్ సీట్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సీట్ల మ్యాట్రిక్స్‌ను సవరించింది. తాజా సవరణలో మూడు మెడికల్ కాలేజీలకు సంబంధించి కొత్తగా 30 అదనపు MBBS సీట్లు చేర్చారు. ఈ కొత్త సీట్లను అభ్యర్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో Choice Filling సమయంలో తమ ప్రాధాన్యతల జాబితాలో చేర్చుకునే అవకాశం కల్పించారు. దీంతో మెడికల్ సీటు పొందేందుకు…

Read Full News

ISROలో ప్రైవేటీకరణ కలకలం.. కులశేఖరపట్నం లాంచ్ సెంటర్‌పై ఉద్యోగుల వ్యతిరేకత

సాధారణంగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వంటి ప్రయోగ వాహకాలను సిద్ధం చేసి ప్రయోగించేందుకు నెలల సమయం పడుతుంది. ఒక్కో ప్రయోగానికి రెండు నుంచి మూడు నెలల సమయం కూడా అవసరమవుతుంది. అయితే చిన్న ఉపగ్రహాలను తక్కువ సమయంలో అంతరిక్షంలోకి పంపేందుకు ఎస్ఎస్ఎల్వీ — స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ — అనే కొత్త తరహా ప్రయోగ వాహకాన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. వారం నుంచి పది రోజుల వ్యవధిలోనే ప్రయోగానికి సిద్ధమయ్యేలా దీనిని రూపొందించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన…

Read Full News

YouTuber Nandana: యూట్యూబర్ నందన అరెస్ట్ కేసులో బిగ్‌ అప్‌డేట్!

ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్ అయ్యారు. ఉద్యోగాల పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడంతో, ఆమె తన భర్తతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే, తాజాగా ఆమె అమెరికా నుంచి ఎమిరేట్స్ ఈకే-526 విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆమె పాస్‌పోర్ట్ తనిఖీ చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఆమెపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు…

Read Full News