నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన ‘వాలా Ⅱ’ హార్ట్ టచ్చింగ్ థియేట్రికల్ ట్రైలర్

నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన ‘వాలా Ⅱ’ హార్ట్ టచ్చింగ్ థియేట్రికల్ ట్రైలర్


కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం వాలా Ⅱ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.

సాహు గారపాటి తన ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే 200 కోట్ల స్థూల వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ‘నేచురల్ స్టార్’ నాని ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘వాలా’ ముగిసిన దగ్గర నుంచి కొనసాగుతూ.. సీక్వెల్ కథ మెయిన్ గ్యాంగ్ జీవితాలను ప్రజెంట్ చేసింది. కాలేజ్ జీవితం, మారుతున్న స్నేహాలు, అనూహ్య మలుపులు… కొత్త దశలో వారి ప్రయాణం సాగుతుంది. ట్రైలర్ చూస్తే కామెడీ, భావోద్వేగ క్షణాలు కలగలిపిన కథతో పాటు, నాస్టాల్జియా మూమెంట్స్ తో కట్టిపడేసింది. ఈ చిత్రంలోని ప్రత్యేకతల్లో ఒకటి ‘ప్రేమమ్’ సినిమాకు ఇచ్చిన ట్రిబ్యూట్. అల్‌ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వంలో నివిన్ పాలీ నటించిన ఆ సినిమా ఇంపాక్ట్ ఇందులో కనిపిస్తుంది. హషీర్, అజిన్ జాయ్, వినాయక్, అలన్ బిన్ సిరాజ్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు, బిజు కుట్టన్, సుధీష్, విజయ్ బాబు వంటి అనుభవజ్ఞులు నటిస్తున్నారు. సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా బలంగా నిలుస్తోంది. ట్రైలర్ ఆధారంగా చూస్తే యూత్ ఫుల్ ఎలిమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ తో ‘వాలా 2’ తెలుగు ప్రేక్షకుల గుర్తుండిపోయే సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమౌతోంది. ‘వాలా 2’ ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *