Gold: రూ.1కే 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం.. అదిరిపోయే ఆఫర్లు.. మీరూ కొనవచ్చు..

Gold: రూ.1కే 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం.. అదిరిపోయే ఆఫర్లు.. మీరూ కొనవచ్చు..


ప్రస్తుతం డిజిటల్ గోల్డ్‌కు ఎక్కువ డిమాండ్ పెరిగింది. యాప్స్ ద్వారా ఎక్కువమంది బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. వీటి ద్వారా బంగారంలో పెట్టుబడులు పెట్టడం, భద్రపర్చుకోవడం లాంటివి చేస్తున్నారు. అయితే వీటి ద్వారా మీరు రూ.1కే బంగారం కొనుగోలు చేయవచ్చు. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారాన్ని రూ.1కే కొనవచ్చు. అంతేకాకుండా వీటిల్లో గోల్డ్ కొంటే మీకు అనేక ఆఫర్లు, డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. సింపుల్‌గా సెకన్లలోనే మీరు వీటిల్లో మీకు నచ్చినంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఎలాంటి పేపర్ వర్క్ కూడా ఉండదు.

డిజిటల్ బంగారం అంటే..?

డిజిటల్ బంగారం అంటే దీనిని మీరు ఆన్‌లైన్ ద్వారా డిజిటల్‌గా కొనుగోలు చేయాలి. ఇది డిజిటల్ రూపంలో మీకు ఉంటుంది. ఫిజికల్ బంగారంలా దీనిని ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల మీ బంగారం చోరీకి గురవుతుందనే టెన్షన్ కూడా ఉండదు. డిజిటల్ బంగారం సురక్షితమైన, బీమా చేయబడిన ఖజానాలో భద్రపరుస్తారు. మీరు డిజిటల్ రూపంలో ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు. ఇక్ ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు చేయవచ్చు. మీరు రూ.1 నుంచే పెట్టుబడి పెట్టవచ్చు. ఇక మీకు అవసరం అనుకుంటే నాణెలు, కడ్డీల రూపంలో డెలివరీ తీసుకోవచ్చు. ఫోన్ పే, పేటీఎం జియో ఫైనాన్స్ లాంటి యాప్స్ ద్వారా మీకు కొనుగోలు చేయవచ్చు. ఇటీవల బంగారం ధరలు పెరుగుతున్న క్రమంలో పసిడిలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. చాలామంది ఈ యాప్స్ ద్వారా బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ధర పెరిగితే లాభం వస్తుందని ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ధర పెరిగినప్పుడు విక్రయించి లాభం పొందుతున్నారు. ఈ యాప్స్ ద్వారా మీకు కావాల్సినప్పుడు కొనుగోలు చేయవచ్చు. ఇక అవసరం అనుకుంటే వెంటనే విక్రయించవచ్చు. 24 క్యారెట్ల బంగారాన్ని మీరు డిజిటల్ రూపంలో కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్లు

ఫోన్ పేలో ఒకేసారి కొనుగోలు చేయకుండా సిప్ రూపంలో నెలనెలా లేదా రోజువారీగా కొనుగోలు చేయవచ్చు. ఇక పేటీఎంలో డిజిటల్ గోల్డ్‌ను డోర్ డెలివరీ కూడా చేస్తారు. దేశవ్యాప్తంగా 12 వేలకుపైగా పిన్ కోడ్‌లకు గోల్డ్ కాయిన్స్‌ను డెలివరీ చేస్తున్నారు. ఇక ఒక్క రూపాయి నుంచే పెట్టుబడి స్టార్ట్ చేయవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *