రుద్రంకోటలోని వేల ఏళ్ల చరిత్రకు పోలవరం ముంపు.. చారిత్రక సంపదకు జలసమాధి ప్రమాదం!
ఏలూరు, జులై 21: తాజాగా పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఇక్కడ వెలుగుచూసిన భారీ సమాధులు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి. మొదట్లో స్థానికులు వీటిని సాధారణ రాతి గుట్టలుగా భావించినా, లోతైన పరిశోధనల్లో అది సింధు నాగరికతకు ముందే విలసిల్లిన మానవ సంస్కృతిగా తేలింది. ఆరు అడుగుల వెడల్పు, పది అడుగుల పొడవుతో నిర్మించిన ఈ సమాధుల్లో లభించిన రంగురంగుల పూసలు, ఇనుప గొడ్డళ్లు, పదునైన కత్తులు, మట్టి పాత్రలు నాటి మానవుల ఆచారాలను స్పష్టం చేస్తున్నాయి….