Viral Video: రాజన్న ఆలయంలో కోడెనాడు ప్రత్యక్ష్యం.. భయంతో పరుగులు తీసిన భక్తులు.. ఇదిగో వీడియో!
వేములవాడ సెప్టెంబర్ 07 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం కోడెనాగు ప్రత్యక్షం కావడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆలయ రాజగోపురం సమీపంలో భక్తుల రాకపోకలు సాగుతున్న సమయంలో సుమారు మూడు గజాల పొడవున్న ఓ కోడెనాగు సంచరిస్తూ కనిపించింది. దీన్ని గమనించిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, ఆ ప్రాంతానికి భక్తులు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టారు….