Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి టీటీడీ భారీ శుభవార్త అందించింది. శ్రీవారి దర్శనం టికెట్ల కోసం భక్తులందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఆన్‌లైన్‌లో ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటివారికి టీటీడీ సూపర్ న్యూస్ అందించింది. జులై నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, వసతి గదుల కోటాను ఆన్ లైన్‌లో విడుదల చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది….