Headlines

MI Captain: హార్దిక్‌ని పీకేసిన ముంబై.. కొత్త కెప్టెన్‌గా తెలుగోడే.. చక్రం తిప్పేసిన రోహిత్..?

ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ వ్యవహారంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జట్టు యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తోందని, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్థానంలో యువ సంచలనం తిలక్ వర్మకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. తెలుగు యువకుడు తిలక్ వర్మ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు తిలక్ వర్మ సారథ్యం వహించవచ్చనే ప్రచారం…

Read Full News

Telangana: చేపల కోసం చెక్‌డ్యామ్‌లో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్..

మత్స్యకారుల వలలో సాధారణంగా రకరకాల చేపలు చిక్కుతుంటాయి. కానీ.. పూర్తిగా నల్లటి రంగులో, వింత ఆకారంలో ఉన్న ఓ చేప వలలో చిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి చేపను గతంలో ఎప్పుడూ చూడలేదంటూ స్థానికులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అరుదైన చేపకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలోని మానేరు చెక్‌డ్యామ్‌లో చేపలు పడుతున్న మత్స్యకారుడు ముత్యం సతీష్ వలలో ఈ వింత…

Read Full News

నీటి స్నానం కాదు.. పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం గురించి తెలుసా?

నీటి స్నానం, పాల స్నానం గురించి విన్న మనకు అడవి స్నానం లేదా జపనీస్ సంప్రదాయ షిరిన్-యోకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇది అడవిలో ఈత కొట్టడం కాదు… ప్రకృతితో మనస్సును మమేకం చేస్తూ పచ్చటి పరిసరాలలో గడపడం. నగర జీవితంలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమితో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ప్రకృతి చికిత్సగా ఉపయోగపడుతుంది. అసలు ఏమిటీ అడవి స్నానం?: 1980లలో జపాన్‌లో ప్రారంభమైన ఈ పద్ధతిని అక్కడ షిరిన్-యోకు అని…

Read Full News

Kurnool: కామన్‌సెన్స్ లేని డాక్టర్లు.. మరీ ఈ స్థాయికి దిగజారాలా..?

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రి.. నిత్యం రోగులకు వైద్యం అందించాల్సిన చోట ఇప్పుడు ఇద్దరు వైద్యుల మధ్య వివాదం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రొఫెషనల్‌ విభేదాలు, ఆధిపత్య పోరు చివరకు చేతబడి, క్షుద్రపూజల ఆరోపణల వరకు వెళ్లాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఆది నాగశేషు, అనస్తీషియా వైద్యురాలు డాక్టర్‌ లక్ష్మి మోనాలిసా మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న ఈ వివాదం తాజాగా మరో మలుపు…

Read Full News

6 అడుగుల ఎత్తు, ఫ్యూచర్ జహీర్‌గా పేరు.. కట్‌చేస్తే.. చెత్త రికార్డులతో ‘లంబూ’ కెరీర్ క్లోజ్.!

Ishant Sharma: భారత మాజీ పేసర్ ఇశాంత్ శర్మ 1988 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో భారత క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కుడిచేతి ఫాస్ట్‌ బౌలర్‌ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్టులో అతని బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఆ ప్రదర్శనతో భవిష్యత్తులో జహీర్ ఖాన్ వారసుడిగా ఎదుగుతాడనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తర్వాత వేగం తగ్గడంతో ఫామ్‌ కోల్పోయాడు. సెలెక్టర్లు…

Read Full News

సింపుల్‌గా, టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..? ఇదిగో సూపర్ రెసిపీ..

భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాన, సాంబార్ ఒక సంప్రదాయ వంటకం. దీనిని ఉదయం అల్పాహారంతో పాటు, మధ్యాహ్నం భోజనంలోనూ ఆనందిస్తారు. అనేక రకాల సాంబార్ వంటకాలు ఉన్నప్పటికీ, ఈ రెసిపీలో ఉల్లిపాయ, టమాటోను మాత్రమే ఉపయోగించి, సులభమైన పద్ధతిలో రుచికరమైన సాంబార్‌ను ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం… ఇది ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: కందిపప్పు: 100 గ్రాములు టమాటాలు: 2 చిన్నవి (పప్పు ఉడికించడానికి), 2…

Read Full News

Cinema : మూవీ చూసి ఇదేం సినిమా అన్నారు.. కట్ చేస్తే.. ఏకంగా నాలుగు జాతీయ అవార్డులతో సంచలనం..

తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం సృష్టించిన దర్శకుడు వంశీ, తన అద్భుత సృష్టి సితార చిత్రానికి లభించిన జాతీయ అవార్డుల గురించి, తన సినీ ప్రస్థానం, స్త్రీ పాత్రల చిత్రణపై తన ఆలోచనలను గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించే వంశీ, సితార జాతీయ పురస్కారాల విజయం వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నారు. సితార చిత్రానికి నాలుగు జాతీయ అవార్డులు లభించడం తన సినీ జీవితంలోనే గొప్ప విశేషంగా…

Read Full News

Telangana: ఏడాదికి 9 పంటలు.. రైతులకు కాసుల వర్షం.. కాకతీయుల కోటలో పచ్చటి సిరులు..

శతాబ్దాల నాటి కాకతీయుల వైభవానికి సజీవ సాక్ష్యం.. శిల్పకళా చాతుర్యానికి నిలువెత్తు నిదర్శనం చారిత్రక ఖిలా వరంగల్. రాతి స్తంభాలు, ఏకశిలా తోరణాలు, పురాతన కోటగోడలతో అలరారే ఈ చారిత్రక క్షేత్రం ఇప్పుడు సరికొత్త సొబగులను అద్దుకుంటుంది. గంభీరమైన రాతి కట్టడాల మధ్య పచ్చని పంటమడులు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడి రైతులు వాణిజ్య పంటలకేమాత్రం తీసిపోని విధంగా ఆకుకూరల సాగు చేపడుతూ కోట గోడల చెంత హరిత విప్లవానికి బాటలు వేస్తున్నారు. ఖిలా వరంగల్ పరిధిలోని వ్యవసాయ…

Read Full News

కన్న తండ్రిపై కొడుకుల పైశాచికత్వం..! నడిరోడ్డుపైనే కర్రలతో దాడి..

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భూమి విక్రయానికి సంబంధించిన వివాదంతో 65 ఏళ్ల వృద్ధ తండ్రిపై ఇద్దరు కుమారులు నడిరోడ్డుపైనే కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన ఇందాపూర్ పట్టణ సమీపంలోని సలీమ్ లాన్స్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుకారాం కిసన్ రౌత్ తన ఇద్దరు కుమారులు సంజయ్ తుకారాం రౌత్, రాజేంద్ర తుకారాం రౌత్‌పై పోలీసులకు ఫిర్యాదు…

Read Full News

Hyderabad: బిగ్ అప్‌డేట్.. లాటరీలో పేరు వచ్చిందా? ఇంటికి అధికారులు వస్తున్నారు.. ఇందిరమ్మ ఇళ్ల తుది జాబితా లెక్కింపు స్టార్ట్!

Indiramma Housing Scheme: హైదరాబాద్‌ పరిధిలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణంలో మరో కీలక దశ మొదలైంది. ఇళ్ల కేటాయింపునకు ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎంపికైన కుటుంబాల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. ఇందిరమ్మ టవర్స్‌లో ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు డ్రా నిర్వహించారు. లాటరీ ద్వారా…

Read Full News