Headlines

ఒకే ఒక్క పాట.. 5 కోట్ల వ్యూస్‌.. చివరికి సింగర్‌ ప్రాణాన్ని తీసేసింది ఇలా!


ఐదు కోట్ల వ్యూస్‌.. ఆ యువ గాయకుడి ప్రాణాలనే బలి తీసుకుంది! యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఒకే ఒక్క పాట హరియాణాకు చెందిన సింగర్‌ అంకిత్‌ బాల్యన్‌ పాలిట శాపంగా మారింది. పాట సక్సెస్‌ను చూసి ఆనందించాల్సిన వేళ, అదే అతడిని కడతేర్చేందుకు కారణమవుతుందని అంకిత్‌ ఊహించి ఉండడు. గ్యాంగ్‌స్టర్ల కక్ష సాధింపునకు బలైన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. ఆగస్టు 26న జిమ్‌ నుంచి బయటకు వస్తున్న 28 ఏళ్ల అంకిత్‌ను దారుణంగా కాల్చి చంపారు. బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాల ప్రకారం ఏకంగా 16 రౌండ్లు కాల్పులు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘భరీ కోర్ట్ మే గోలీ మారేంగే’ అనే పాటలో అంకిత్‌ నటించాడు. అది యూట్యూబ్‌లో 54 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లింది. అయితే ఈ పాటలోని సాహిత్యం ..2021లో రోహిణి కోర్టులో హత్యకు గురైన తమ గ్యాంగ్‌ లీడర్ జితేందర్‌ గోగిని అవమానించేలా ఉందని గోగి గ్యాంగ్‌ భావించింది. అంతేకాదు, ప్రత్యర్థి గ్యాంగ్‌కు అంకిత్‌ మద్దతు ఇస్తున్నాడన్న కక్షతోనే గోగి గ్యాంగ్‌ , అంకిత్‌ను దారుణంగా కాల్చి చంపింది. ఈ హత్య తర్వాత పోలీసులు వేగంగా స్పందించారు. గత నెల 31న దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయగా, ఎదురుకాల్పుల్లో మోహిత్‌, సుమిత్‌ అనే నిందితులు హతమయ్యారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, లేదంటే సీఎం ఇంటి ముందు ఆత్మాహుతి చేసుకుంటామని అంకిత్‌ భార్య హెచ్చరించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇద్దరు నిందితుల ఎన్‌కౌంటర్‌తో ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్‌ లోను ఉంటే ఎవరు కట్టాలి?

H1N1 virus: విజృంభిస్తున్న H1N1 వైరస్‌…ఫ్లూ వ్యాక్సిన్‌కు భారీగా పెరిగిన డిమాండ్

Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ

Tirupati: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *