కృష్ణ గారి పద్మాలయ స్టూడియో ప్రారంభం వెనుక ఇంత కథ జరిగిందా..? ఇప్పుడు..
తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణది ఒక ప్రత్యేక అధ్యాయం. ఆయన డేరింగ్, డాషింగ్ స్వభావం, అపజయాలకు కుంగిపోని దృఢమైన మనస్తత్వం ఆయనను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. తను చేయాలనుకున్నది ఆచరణలో పెట్టడం, అనుకున్నది సాధించడం ఆయన లక్ష్యంగా ఉండేది. ఈ లక్ష్య సాధనకు, సాహసానికి నిదర్శనంగా పద్మాలయ స్టూడియో నిర్మాణం నిలుస్తుంది. సొంతంగా స్టూడియో నిర్మించాలనే ఆలోచన 1975లో హీరో కృష్ణకు మొలకెత్తింది. ఆ సమయంలోనే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోను…