నందగోకుల్ వెళ్ళాలంటే అంటే హెల్మెట్ ఉండాల్సిందే.. లేదంటే నో ఎంట్రీ
ప్రాణం కంటే హెల్మెట్ బరువు ఎక్కువ కాదు..కానీ ఆ చిన్న హెల్మెట్ లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించింది మెదక్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. అదే 'నందగోకుల్'.ఆ ఊరి పొలిమేర దాటాలంటే తలకు హెల్మెట్ ఉండాల్సిందే..లేదంటే 'నో ఎంట్రీ' బోర్డు దర్శనమిస్తుంది. గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీసుకున్న ఈ ఆదర్శవంతమైన నిర్ణయం పై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. వారం…