ఆత్మహత్య కాస్త హత్య కేసుగా మారింది. కట్టుకున్న భర్త, కన్న కొడుకు అరెస్ట్ అయ్యారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం తువ్వపల్లె గ్రామానికి చెందిన 44 ఏళ్ల శెట్టి వరాలు డిసెంబర్ 15 న మృతి చెందింది. ఉరి వేసుకున్నట్లుగా కనిపించింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని వరాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆత్మహత్య కింద కేసు కూడా నమోదయింది. అయితే పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం నివేదికలో ఆత్మహత్య కాదని హత్య అని తేలింది.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు మరోసారి దర్యాప్తు చేపట్టారు. పోలీసు దర్యాప్తులో కూడా హత్య అని తేలింది. భర్త వెంకటాచంద్రుడు కొడుకు వెంకటరమణ కూడా హత్య చేసినట్లు అంగీకరించారు. అధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. కుటుంబ కలహాలు అనుమానం కారణంగా టవల్‌తో గొంతు బిగించి నోరు ముక్కు మూసి పెట్టి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కు కోర్టు ఆదేశించగా జైలుకు తరలించారు. చూశారుగా.. పోలీసులు కాస్త వదిలేసిన.. పోస్టుమార్టం మాత్రం గుర్తును రట్టు చేసేసింది