గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి
నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు జనజీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశాయి. ఇళ్లు నీట మునిగి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ విలయతాండవంలోనూ ఆశను వదలని ఓ 91 ఏళ్ల వృద్ధురాలు ఆశ్చర్యంగా ప్రాణాలతో బయటపడింది. నువాకోట్‌లోని దేవీఘాట్‌లో ఉన్న ‘సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్’ వృద్ధాశ్రమాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. అల్పాహారం తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీరు రావడంతో ఏడుగురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. కింది అంతస్తులోని…