పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు తోడు వడగాలులు తోడవడంతో రోడ్లన్నీ నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఈ వేడికి ఎలక్ట్రిక్ వాహనాలు సైతం రోడ్డుపైనే తగలబడిపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో పెట్రోల్ బంక్ యజమానులు.. ఒక ఐడియా వేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో నిర్మల్ జిల్లాలోని పెట్రోల్ బంక్ నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా సారంగాపూర్ మండలం చించోలి ‘బి’ గ్రామంతో పాటు లక్ష్మణచందా, దిల్వార్‌పూర్ ప్రాంతాల్లోని బంకుల్లో వినూత్నంగా పెట్రోల్, డీజిల్ మిషన్లకు ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వేళ ఎండ దెబ్బకు మిషన్లు వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉందని, అలా జరగకుండా ఉండాలంటే నిరంతరం చల్లదనం అందించడమే మార్గమని నిర్వాహకులు చెబుతున్నారు. కేవలం మిషన్లకే కాకుండా, పెట్రోల్ కోసం వచ్చే వాహనదారులు కూడా కాసేపు చల్లగా సేదతీరేలా బంకుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిప్పులు కురిపిస్తున్న ఎండలో ప్రయాణిస్తున్న వాహనదారులు, బంకుల్లోని కూలర్ల వద్ద ఆగి కాస్త ఉపశమనం పొందుతున్నారు. ప్రమాదాలను నివారించేందుకు బంక్ యజమానులు తీసుకుంటున్న ఈ ‘కూల్’ నిర్ణయాన్ని వాహనదారులు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు

Monalisa Bhosale: రక్షణ కోరుతూ కేరళం సీఎంకు మోనాలిసా లేఖ

ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. మూడు రోజుల్లో మురిపించనున్న వర్షాలు

యురేనియం అప్పగింతకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

ఇంటర్‌ ఫలితాల్లో అదరగొట్టిన ట్విన్స్‌.. ప్రతి సబ్జెక్ట్‌లో సేమ్ మార్కులు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *