కావాల్సిన పదార్థాలు: ఎర్ర గోధుమ రవ్వ: 1 కప్పు, నీళ్లు: 4 కప్పులు, తురిమిన బెల్లం: అర కప్పు , 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి,
జీడిపప్పు: కొన్ని, కిస్మిస్: కొన్ని, యాలకుల పొడి: 4 యాలకులకు సరిపడా తీసుకోవాలి. ముందుగా ఒక మందపాటి పాన్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసి వేయించి, ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.