Headlines

Arjun Sarja: ఆ భయమే నన్ను ఫిట్‌గా ఉండేలా చేస్తుంది.. 64 ఏళ్ల వయసులో ఇదే నా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇవే..


యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన సినీ ప్రయాణంలో ఫిట్‌నెస్‌ను ఎలా మెయిన్ టెన్ చేస్తున్నారో, ఆయనకు ప్రేరణ ఏమిటి అనే విషయాలపై ఆసక్తికరమైన వివరాలు పంచుకున్నారు. నిలకడైన ఫిట్‌నెస్ కోసం డబ్బు, తగిన సమయం లేదా ఉత్తమ శిక్షకుడు ఉన్నా సరిపోదని, వ్యక్తిగత ప్రేరణ , ఆత్మవిశ్వాసం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. “మీరు మీ శరీరాన్ని ఒక గంట పాటు జాగ్రత్తగా చూసుకుంటే, అది మిమ్మల్ని 23 గంటల పాటు చూసుకుంటుంది” అనే స్వామీజీ మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సూత్రం తన జీవితంలో చాలా నిజమనిపించిందని అన్నారు. వ్యాయామం చేయాలనిపించనప్పుడు కూడా, మనల్ని మనం జిమ్‌కు లేదా వ్యాయామానికి నెట్టగలగాలి అని అర్జున్ సర్జా అన్నారు. ఉదయాన్నే అందరిలాగే తనకు కూడా కాఫీ తాగుతూ టీవీ చూస్తూ కూర్చోవాలనిపిస్తుందని, కానీ తన ఆరోగ్యం కోసం ఈ అలవాట్లను అధిగమించడం నేర్చుకున్నానని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

ప్రజలు తనను ఎల్లప్పుడూ యంగ్‌గా, ఆరోగ్యంగా చూడటానికి కారణం ఇదేనని పేర్కొన్నారు. ఫిట్‌నెస్ కేవలం నటుడిగా తన వృత్తికి అవసరం కాదని, తన కుటుంబం కోసం, తన సొంత ఆరోగ్యం కోసం కూడా ముఖ్యమని ఆయన అన్నారు. కుటుంబానికి తన అవసరం ఉన్నప్పుడు పూర్తి శక్తితో సిద్ధంగా ఉండాలి అనే ఆలోచన తనకు ప్రేరణనిస్తుందని వివరించారు. అలాగే, నటులకు “భయం” కూడా ఒక ప్రేరణ అని అర్జున్ సర్జా సరదాగా అన్నారు. ప్రేక్షకులు తమను ఎలా చూస్తారనే భయం క్రమశిక్షణను పెంచుతుందని అన్నారు. ఉదాహరణకు, తాను బరువు పెరిగితే, ప్రేక్షకులు తన గత చిత్రాలను గుర్తుచేసుకుంటూ “అప్పుడు బాగుండేవాడులే, ఇప్పుడు లేడులే” అని అనుకుంటారని, ఈ భయమే తనను ఫిట్‌గా ఉండేలా చేస్తుందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

తన చిన్నతనంలోనే ఫిట్‌నెస్‌కు బలమైన పునాది వేసుకున్నట్లు ఆయన వివరించారు. ” పాత ఫోటోల్లో ఉన్నప్పుడు, నేను కేవలం ఒక గంట కాదు, గంటల తరబడి వర్కౌట్స్ చేసేవాడిని” అని గుర్తుచేసుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా పరుగు, వివిధ క్రీడలు, కరాటే, గుర్రపు స్వారీ, ఈత, జిమ్నాస్టిక్స్ వంటి అనేక వ్యాయామాలు చేశానని తెలిపారు. ఒక భవనానికి పునాది ఎంత ముఖ్యమో, అలాగే శరీరానికి చిన్నతనంలోనే ఇలాంటి శిక్షణతో బలమైన పునాదిని ఏర్పరచుకోవాలని సూచించారు. ఆ పునాది ఉంటే, తర్వాత జీవితంలో కొద్దిగా నిర్లక్ష్యం చేసినా శరీరం నిలబడుతుందని, అయితే క్రమశిక్షణను కొనసాగించడం చాలా ముఖ్యమని అన్నారు. బిజీ షెడ్యూల్స్ మధ్య ఫిట్‌నెస్‌ను ఎలా నిర్వహించుకుంటారని అడిగినప్పుడు, “ఎక్సర్సైజ్‌ను షెడ్యూల్‌గా పెట్టుకోవాలి, అప్పుడే మిగిలినవి షెడ్యూల్ అవుతాయి” అని ఆయన సమాధానమిచ్చారు. టిఫిన్‌కు ఎలా ప్రాధాన్యతనిస్తామో, అలాగే వ్యాయామానికి కూడా ప్రాధాన్యతనిచ్చి దాన్ని షెడ్యూల్‌లో చేర్చుకోవాలని ఆయన సూచించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *