కొంపముంచిన నాలుగేళ్ల నాటి పెళ్లి వీడియో.. వేట మొదలు పెట్టిన పోలీసులు..!
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఓ వివాహ వేడుకకు సంబంధించిన కాల్పుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకలో ఓ యువకుడు పిస్టల్‌తో వరుసగా కాల్పులు జరుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సుమారు ఐదు సెకన్ల వ్యవధిలోనే 17 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో అధికారులు సుమోటోగా కేసును పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో వైరల్‌గా మారిన వీడియో సుమారు నాలుగేళ్ల నాటిదిగా…