Headlines

రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? అయితే, ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..!


రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదు అంటారు. కానీ, యాపిల్‌ను రాత్రి వేళల్లో తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. యాపిల్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల శరీరంలో కలిగే లాభ, నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం..

రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల కలిగే నష్టాలు:

జీర్ణ సమస్యలు మరియు గ్యాస్:

యాపిల్‌లో పెక్టిన్ అనే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. రాత్రి వేళల్లో మన జీర్ణవ్యవస్థ వేగం తగ్గుతుంది. ఈ సమయంలో పెక్టిన్ సరిగ్గా జీర్ణం కాక కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా అసౌకర్యానికి దారితీస్తుంది.

ఎసిడిటీ, గుండెల్లో మంట:

యాపిల్స్‌లో సహజసిద్ధమైన ఆర్గానిక్ యాసిడ్లు ఉంటాయి. రాత్రి పడుకునే ముందు వీటిని తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగి ఎసిడిటీ, నెమ్ము లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఎదురవుతాయి.

ఇవి కూడా చదవండి



నిద్రలేమి సమస్యలు:

యాపిల్‌లో ఉండే సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. నిద్రపోయే ముందు శరీరానికి శక్తి లభిస్తే అది నిద్ర నాణ్యతను దెబ్బతీసే అవకాశం ఉంది.

యాపిల్ తినడానికి సరైన సమయం ఏది?

ఉదయం పూట :

యాపిల్ తినడానికి ఉదయం పరగడుపున లేదా టిఫిన్ తర్వాత అత్యుత్తమ సమయం. ఉదయాన్నే తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది, పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు రోజంతా అవసరమైన శక్తి లభిస్తుంది.

స్నాక్ సమయం :

మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్‌కు బదులుగా యాపిల్ తినడం చాలా మంచిది.

యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, రాత్రి పడుకునే ముందు తినడం మానుకోవడం శ్రేయస్కరం. జీర్ణ సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా రాత్రి వేళల్లో పండ్లను తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *