OTT Movie: ఆ అమ్మాయిని ఎవరు చంపారు? ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఓటీటీలో అయితే ఈ మాలీవుడ్ సినిమాలను ఎగబడి చూస్తున్నారు ఆడియెన్స్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం రెండు, మూడు మలయాళం సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక మలయాళం మూవీనే. అందులోనూ ప్రజెంట్ ట్రెండ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందిన మూవీ….