ఎంబీఏ చదివి.. మార్కెటింగ్ మేనేజర్‌గా మంచి ఆదాయం.. ఈ ఒక్క తప్పుతో దొంగగా మాారాడు..
మంచి చదువు.. మంచి ఉద్యోగం.. చేతినిండా సంపాదన.. హ్యాపీ లైఫ్.. కానీ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ మోజులో పడి నష్టపోయాడు. అప్పులు, నష్టాలు వెంటాడటంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. చివరకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. పట్టపగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ.. దోచుకున్న సొమ్మును మళ్లీ బెట్టింగ్‌లో పెట్టాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెంకు చెందిన అలుగుబెల్లి రాము ఉన్నత చదువులు చదివాడు. హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగం చేశాడు….