Headlines

గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి

నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు జనజీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశాయి. ఇళ్లు నీట మునిగి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ విలయతాండవంలోనూ ఆశను వదలని ఓ 91 ఏళ్ల వృద్ధురాలు ఆశ్చర్యంగా ప్రాణాలతో బయటపడింది. నువాకోట్‌లోని దేవీఘాట్‌లో ఉన్న ‘సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్’ వృద్ధాశ్రమాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. అల్పాహారం తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీరు రావడంతో ఏడుగురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. కింది అంతస్తులోని…

Read Full News

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌

డ్రైవింగ్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక నూతన విధానాన్ని తీసుకురానుంది. ట్రాఫిక్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌పై పాయింట్లు తగ్గించే సరికొత్త సిస్టమ్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 66వ సియామ్ వార్షిక సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను ప్రకటించారు. ఈ కొత్త విధానం ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లు కోల్పోవడం జరుగుతుంది. ఒకవేళ పరిమితి దాటితే లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు…

Read Full News

IND W vs PAK W: 17 ఏళ్లలో కేవలం మూడేనా.. భారత్‌పై పాక్ చివరిసారి ఎప్పుడు గెలిచిందో తెలుసా ?

IND W vs PAK W: మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా ఈరోజు దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య రికార్డులు పరిశీలిస్తే టీమిండియాదే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. గత 17 ఏళ్లలో పాకిస్థాన్‌పై భారత్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించి తన సత్తా చాటుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు మొత్తం 17 సార్లు ఎదురెదురుగా నిలిచాయి. అందులో…

Read Full News

Tawa Paneer Tikka Masala: వహ్వా.. తవాపై పనీర్ టిక్కా.. ఈ స్నాక్ చేస్తే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుని తింటారు!

ఈ రెసిపీ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముందుగా పనీర్, కూరగాయలను మసాలా పెరుగు మిశ్రమంలో ఊరబెట్టి, ఆ తర్వాత తవాపై నెమ్మదిగా వేయిస్తే సరిపోతుంది. చివర్లో చాట్ మసాలా చల్లి గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ సలాడ్, నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తే సాయంత్రం స్నాక్‌గా అదిరిపోతుంది. 1. కావాల్సిన పదార్థాలు పనీర్ – 250 గ్రాములు పెరుగు – ½ కప్పు పసుపు – ½ టీస్పూన్ కాశ్మీరీ ఎర్ర మిరప పొడి – 1…

Read Full News

Gen Z Breakfast: జెన్ జీలకు ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ పండుకు ఇంత డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

ఇక జెన్ జెడ్ తరంలో అవకాడో టోస్ట్‌కు ప్రత్యేక క్రేజ్ ఏర్పడటానికి సోషల్ మీడియా కూడా ఒక కారణంగా నిలుస్తోంది. టోస్ట్ చేసిన బ్రెడ్‌పై మెత్తగా చేసిన అవకాడో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చాట్ మసాలా, ఉడికించిన గుడ్డు వంటి వాటిని జోడించి రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. అందంగా కనిపించే ఈ బ్రేక్‌ఫాస్ట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువతలో మరింత ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో భారతదేశంలో కూడా అవకాడో సాగు వైపు రైతుల…

Read Full News

High Court: తెలంగాణ హైకోర్టులో ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో తెలుసా? నెంబర్ వింటే..

తెలంగాణ హైకోర్టులో రోజురోజుకూ పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూనే పోతుంది. 2025 నాటికి హైకోర్టులో 2.29 పెండింగ్‌ కేసులు ఉన్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యంగా 1,36,396 రిట్‌ పిటిషన్లు, 21,247 సివిల్‌ అప్పీళ్లు, 14,511 మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్‌ కేసులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. క్రిమినల్‌ అప్పీళ్లు కూడా వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు 31,995 కేసులు పదేళ్లకు పైగా పరిష్కారం కాకుండా కొనసాగుతున్నట్లు వెల్లడైంది. న్యాయమూర్తుల కొరత కూడా పెండెన్సీకి ప్రధాన…

Read Full News

హైదరాబాద్ – విజయవాడ హైవే ఇక 6 లేన్స్! ట్రాఫిక్ జామ్‌లకు గుడ్‌బై..

ఆ రూట్ లో ట్రాఫిక్ మామూలుగా ఉండదు. సంక్రాంతి సమయంలో వెళితే చుక్కలు కనిపిస్తాయి. అదే హైదరాబాద్-విజయవాడ రహదారి. ఇలాంటి సమయంలో ఓ పెద్ద అప్ డేట్ వచ్చింది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవేను సిక్స్ లేన్స్.. అంటే ఆరు వరసలుగా విస్తరించే క్రమంలో పెద్ద ముందడుగు పడింది. P-P-P-A-C… దీనికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇక కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అప్రూవల్ తో పనులు స్టార్టవుతాయి. ఈ మాట విని ఆ రూటులో వెళ్లేవారంతా ఫుల్…

Read Full News

పాత డీజిల్ వాహనదారులకు శుభవార్త

పాత డీజిల్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా స్క్రాప్ చేయాలనే నిబంధనలతో ఇబ్బంది పడుతున్న వాహన యజమానులకు ఊరటనిస్తూ కేంద్రం ఒక కొత్త పాలసీని తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. లక్షలు వెచ్చించి కొత్త వాహనాలు కొనుగోలు చేయలేని మధ్యతరగతి, రవాణా రంగం వారి కోసం ఈ కొత్త టెక్నాలజీ ఒక గొప్ప వరంగా మారనుంది. దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు, అదే సమయంలో పాత వాహనాల…

Read Full News

Fatty Liver: ఒక్క చుక్క మద్యం తాగకపోయినా ఫ్యాటీ లివర్ సమస్య ఎందుకు వస్తోంది?

కాలేయం శరీరంలో కీలకమైన అవయవం. ఆహారాన్ని ప్రాసెస్ చేయడం, రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడటం, వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి అనేక ముఖ్యమైన పనులను ఇది నిర్వహిస్తుంది. అయితే కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోతే కాలక్రమేణా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బయటకు సన్నగా కనిపించినప్పటికీ పొత్తికడుపు చుట్టూ అంతర్గత కొవ్వు ఎక్కువగా ఉన్నవారిలో కూడా జీవక్రియ సంబంధిత సమస్యల ప్రమాదం ఉండవచ్చు. 1. MASLD అంటే ఏమిటి? మద్యం కారణంగా కాకుండా, ప్రధానంగా శరీరంలోని…

Read Full News

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు ఒక్కసారి నమ్మితే జీవితాంతం అండగా నిలుస్తారు.. అయితే..?

సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తి మూలాంకాన్ని లెక్కించవచ్చు. ప్రతి మూలాంకానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతుంది. ముఖ్యంగా 7, 16 లేదా 25 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 7. ఈ మూలాంకానికి కేతువు ప్రభావం ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో భావిస్తారు. అందుకే వీరిలో లోతైన ఆలోచన, ఆధ్యాత్మికత, అంతర్ముఖ స్వభావం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతారు. వీరు సాధారణంగా ప్రశాంతంగా, కొంత గోప్యంగా కనిపిస్తారు. ప్రతి విషయాన్ని పైపైగా కాకుండా లోతుగా…

Read Full News