గ్యాస్‌ కష్టాలు.. ఆటోలో సిలిండర్లను లాక్కెళ్ళిన మహిళలు

గ్యాస్‌ కష్టాలు.. ఆటోలో సిలిండర్లను లాక్కెళ్ళిన మహిళలు


మెదక్ జిల్లాలో గ్యాస్ కష్టాలు మహిళల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. సిలిండర్‌ బుక్ చేసి నెల రోజులవుతున్నా సిలిండర్లు రాకపోవడంతో సామాన్యుల సహనం నశించి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ క్రమంలో శివంపేట మండలం దొంతి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ గ్యాస్ కష్టాలకు గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు కన్నెర్ర జేశారు. మంగళవారం ఉదయం సుమారు 40 సిలిండర్లతో గ్రామానికి గ్యాస్ డెలివరీ ఆటో వచ్చింది. సిలిండర్లతో వచ్చిన ఆటోను గమనించిన మహిళలు, గ్రామస్తులు చుట్టుముట్టారు. గత కొంతకాలంగా గ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో పొయ్యి వెలగక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్స్ కావాలనే జాప్యం చేస్తున్నారని, సకాలంలో తమకు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట వినని డెలివరీ బాయ్స్‌పై మండిపడుతూ.. ఆటోలో ఉన్న 40 సిలిండర్లను మహిళలు బలవంతంగా లాక్కెళ్లారు. తాము నెలల తరబడి బుక్ చేసుకుని ఎదురుచూస్తుంటే తమకు ఇవ్వరు కానీ.. బ్లాక్‌లో ఎలా అమ్ముతారు? అంటూ అధికారుల తీరును నిలదీశారు. ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల సామాన్యులు అల్లాడిపోతున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ కష్టాలను తీర్చాలని దొంతి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వింత దొంగను పట్టించిన సీసీ కెమెరా.. ఏం చేశాడో తెలుసా

చెట్ల కొమ్మలపై తిరిగే కోతి.. సడన్‌గా ఊయలెక్కి ఊగితే..

కోడిపుంజు వింత అరుపులు.. ఏం జరిగిందా అని చూడగా.. షాకింగ్‌ సీన్‌

ఇదేందయ్యా ఇదీ.. వధువు ఒక్కరే.. వరులు మాత్రం ఇద్దరా !!

TOP 9 ET: ఇట్స్ కన్ఫర్మ్‌! వాయిదాపడిన పెద్ది | డ్యూటీ ఎక్కారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *