Headlines

RCB: ఆర్సీబీ పేరు మళ్లీ మారుతుందా? ఫ్రాంచైజీ కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా సంచలన ప్రకటన

RCB: ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా వరుసగా రెండో ఏడాది టైటిల్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మళ్లీ మారబోతోందా? యాజమాన్యం హక్కులు మారిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆర్సీబీ కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా క్లారిటీ ఇచ్చారు. అభిమానులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే ప్రకటన చేశారు. ఇటీవలే ఆర్సీబీ ఫ్రాంచైజీ వంద శాతం వాటాలను ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్ సంయుక్తంగా కొనుగోలు చేశాయి….

Read Full News

ఒకప్పుడు తిరుగులేని నటి.. నేడు ఒంటరిగా,ఆకలితో.. స్టార్ హీరోయిన్ కన్నీటి గాథ

అభిమానుల జయజయధ్వానాలు, కెమెరా ఫ్లాష్‌లైట్ల వెలుగులు, రత్నాల ఉయ్యాలలు.. ఒకప్పుడు ఆమె జీవితం ఒక మహారాణి వైభవం. ప్రేమికులు ఆమె కోసం రక్తంతో లేఖలు రాసేంత అందం ఆమె సొంతం. పాకిస్థానీ వెండితెరపై ‘స్టాచ్యూ ఆఫ్ మార్బుల్’గా వెలిగిపోయిన అందాల రాణి సాబిరా సుల్తానా జీవితం నేడు కనుపాప కన్నీరయ్యేలా మారింది. సాబిరా సుల్తానా (అసలు పేరు ‘రాబియా బేగం’) డిసెంబరు 21, 1945న బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి (నేటి ముంబై) లో ఒక కాశ్మీరీ కుటుంబంలో…

Read Full News

Blood Pressure Control: బీపీ ఉన్నవారికి వరం ఈ పండు.. మీ డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే!

అరటిపండులో పొటాషియంతో పాటు పీచు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. శరీరంలో సోడియం ఎక్కువగా ఉండటం రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. పొటాషియం సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేయడంలో, అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీంతో రక్తనాళాలపై ఒత్తిడి తగ్గేందుకు, రక్తప్రసరణ సజావుగా సాగేందుకు మద్దతు లభించవచ్చు. అయితే అరటిపండు తినడం ఒక్కటే అధిక రక్తపోటుకు చికిత్స కాదు. బీపీ మందులు వాడుతున్న వారు వాటిని ఆపకుండా, వైద్యుల సూచనలను పాటిస్తూ ఆహారంలో మార్పులు…

Read Full News

కామెడీ సినిమా చేయాలంటే నిజంగా అంత కష్టపడుతున్నారా..?

ఒకప్పట్లా తెలుగులో కామెడీ సినిమాలు ఇప్పుడెందుకు రావట్లేదు..? అల్లరి నరేష్ లాంటి హీరోలు కూడా ఎందుకు కామెడీ వదిలేసి సీరియస్ బాట పడుతున్నారు..? హిలేరియస్ కథలు మన రైటర్లు రాయలేకపోతున్నారా లేదా ఏ కామెడీ చేసినా వివాదానికే దారి తీస్తుందా..? ఇలాంటి సమయంలోనూ ఆ ఒక్క దర్శకుడు మాత్రమే ఎలా ఎంటర్‌టైన్మెంట్‌తో నెట్టుకొస్తున్నారు..? తెలుగులో కామెడీ సినిమాలు ఒకప్పుడు రాజేంద్రప్రసాద్.. ఆ తర్వాత అల్లరి నరేష్ పేర్లే గుర్తుకొస్తాయి. అయితే కొన్నేళ్లుగా ఒకప్పట్లా ఎంటర్‌టైన్మెంట్ సినిమాలు రావట్లేదు….

Read Full News

Yash’s Toxic Movie: టాక్సిక్ ముంచేసింది.. ఆశలన్నీ రావణుడిపైనే

మామూలుగా ఓ పెద్ద సినిమా పోతే స్టార్ హీరోలకు పెద్దగా నష్టమేం ఉండదు.. మళ్లీ హిట్ కొడితే పరిస్థితి మామూలే. కానీ యశ్‌కు మాత్రం అలా లేదు సిచ్యువేషన్. ఈయన కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ బిజీ బిజీగా ఉన్నారు. దాంతో ఫ్లాప్ వస్తే ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. టాక్సిక్ ముంచేయడంతో.. రావణుడిపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు రాకింగ్ స్టార్. మరి రామాయణ ఎలా ఉండబోతుంది..? టాక్సిక్ అనే ఒక్క సినిమాతో చాలా మంది జాతకాలు మారిపోయాయి….

Read Full News

నేపాల్ ట‌న్నెల్‌లో స‌జీవంగా చైనా వ్యక్తి.. కూలిన ఇంట్లో ప్రాణాల‌తో 64 ఏళ్ల మ‌హిళ‌

వరదలు, బురద, శిథిలాల మధ్య సహాయక బృందాలు రోజుల తరబడి గాలిస్తున్నాయి. ఈ క్రమంలో బురద, శిథిలాల కింద 10 రోజులుగా చిక్కుకుపోయిన ఓ చైనా కార్మికుడిని సజీవంగా గుర్తించి, ఎంతో శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అలాగే, 64 ఏళ్ల నేపాల్ మహిళను కూడా శిథిలాల మధ్య నుంచి కాపాడి ఆస్పత్రికి తరలించారు. త్రిశూలి 3A  జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఓ చైనా కార్మికుడిని సహాయక బృందాలు రక్షించాయి.  నేపాల్ సైనిక సిబ్బంది, దక్షిణ…

Read Full News

El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పొంచి ఉన్న పెను ముప్పు

భూమి మరోసారి పెను విపత్తు అంచున నిలిచింది. రాబోయే నెలల్లో ‘ఎల్ నినో’ అత్యంత శక్తివంతంగా మారనుందని, ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగడం దాదాపు ఖాయమని ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు తప్పవని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి ఎల్ నినో తన గరిష్ట స్థాయికి…

Read Full News

Shortness of Breath: మెట్లు ఎక్కగానే ఆయాసమా? ఇది ఫిట్‌నెస్ సమస్య అనుకుంటే నష్టపోతారు..

ప్రతిసారీ మెట్లు ఎక్కినప్పుడు అసాధారణంగా తీవ్రమైన అలసట లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంటే మాత్రం దానిని సాధారణంగా తీసుకోకూడదు. అధిక బరువు, తక్కువ ఫిట్‌నెస్‌తో పాటు తక్కువ హిమోగ్లోబిన్ వంటి సమస్యలు కూడా శ్రమ సమయంలో అలసటను పెంచవచ్చు. మరికొన్ని సందర్భాల్లో గుండె లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల సంకేతంగా కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపించవచ్చు. ముఖ్యంగా ఛాతీ నొప్పి, తల తిరగడం, స్పృహ కోల్పోవడం, పెదవులు నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు…

Read Full News

SBI Asha Scholarship: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.15 లక్షల వరకు స్కాలర్‌షిప్.. చివరి తేదీ ఇదే!

SBI Asha Scholarship 2026-27: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో SBI Foundation కీలక స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. SBI Platinum Jubilee Asha Scholarship 2026-27 పేరుతో అందిస్తున్న ఈ స్కాలర్‌షిప్ ద్వారా 9వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. విద్యార్థులు చదువుతున్న కోర్సు, విద్యా సంస్థ, అర్హతలను బట్టి సంవత్సరానికి రూ.15,000 నుంచి రూ.15 లక్షల…

Read Full News

 Brinjal Pepper Masala Recipe : వంకాయతో మటన్ రుచి.. ఈ మసాలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

రోటీ, చపాతీ, దోసెతో పాటు అన్నంలో కూడా ఈ మసాలా బాగా సరిపోతుంది. ఇంట్లో సాధారణంగా అందుబాటులో ఉండే పదార్థాలతోనే దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మామూలు వంకాయ కూరకు భిన్నంగా ఏదైనా చేయాలనుకునేవారు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. కావాల్సిన పదార్థాలు వంకాయలు – 3 ఉల్లిపాయ – 1 టమాటో – 1 వెల్లుల్లి రెబ్బలు – 10 కారం – 1 టీస్పూన్ ధనియాల పొడి – 3 టీస్పూన్లు జీలకర్ర పొడి…

Read Full News