Headlines

IND vs AFG: పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది.. బీసీసీఐ ప్లాన్ వెనుక సీక్రెట్ ఇదే

IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న మూడు టి20ల సిరీస్‌ కోసం భారత సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గత జింబాబ్వే పర్యటనలో ఆడిన 8 మంది ఆటగాళ్లను ఈ సిరీస్ నుంచి తప్పించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాభవం వల్ల పాకిస్థాన్ జట్టు ఏకంగా 7 మంది ఆటగాళ్లపై వేటు వేసింది. కానీ…

Read Full News

బీజేపీ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బీజేపీ కార్యకర్తల అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపేందుకు, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హక్కు ఉంటుందని, కానీ తెలంగాణలో ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ, వైఫల్యాలను ప్రశ్నించినందుకు, జవాబుదారీతనం కోరినందుకు ప్రతిపక్ష నాయకులను నిర్బంధిస్తున్నారంటూ కేంద్ర మంత్రి మండిపడ్డారు. బాధితులను పరామర్శించడానికి నల్గొండకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ బీజేపీ నాయకులను గృహ…

Read Full News

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు.. 1931 హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కీలక అప్‌డేట్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1: మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) పోస్టులకు పోటీ పడిన అభ్యర్థుల్లో మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ ప్రక్రియ చేపట్టారు. ప్రతి పోస్టుకు 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు ఎంపిక చేసినట్లు MHSRB తెలిపింది. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల కావడంతో నియామక ప్రక్రియ మరో కీలక దశలోకి ప్రవేశించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు ఇక సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌లో సమర్పించే ధ్రువపత్రాల ఆధారంగా అర్హతలను…

Read Full News

Andhra Pradesh: ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం.. ఇదే చివరి ఛాన్స్.. మిస్సయితే మీ ఓటు గల్లంతే..

ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు ఈసీ మరోసారి గడువులు మార్చింది. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా.. అనర్హుల పేర్లను తొలగించేలా చేపట్టిన SIR ప్రక్రియలో క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణకు మరింత సమయం ఇచ్చింది. ఏపీ సీఈవో విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 14న SIRకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కేంద్ర…

Read Full News

Video: మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే నవ్వులే నువ్వు..

నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. టికెట్ బుకింగ్ నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం వరకు సాంకేతికతతో పనులు సులువైపోయాయి. ప్రస్తుత తరానికి ఏఐ అనేది దైనందిన జీవితంలో ఒక సాధారణ విషయంగా మారినప్పటికీ, పాత తరం వారికి మాత్రం ఇది ఇంకా వింతగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో ఏఐ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీని నిజమైన మనిషి అనుకుని అమాయకంగా మాట్లాడిన ఓ బామ్మ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను దోచుకుంటోంది….

Read Full News

Bank Rules: అమౌంట్ చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు రాస్తారు..? అరెరె.. అసలు రీజన్ ఇదేనట..

అయితే ఓన్లీ అనేది చివరిలో రాయకపోతే మీ చెక్కు లేదా డిపాజిట్, విత్ డ్రా ఫామ్ చెల్లదని కాదు. మీరు రాయకపోయినా అది చెల్లుతుంది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి ప్రత్యేక నిబంధన విధించలేదు. కేవలం భద్రతాపరమైన కారణాల వల్ల చివరిలో ఓన్లీ అనేది రాయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మొత్తాన్ని స్పష్టంగా రాయడం, ఖాళీ స్థలం వదలకపోవడం అనేది భద్రత కోసమేనని చెప్పవచ్చు. Source link

Read Full News

Chicken Fry: చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే ‘చికెన్ ఫ్రై’..

కావలసిన పదార్థాలు: ఒక కిలో చికెన్ చిన్న ముక్కలు కొట్టినవి, 3 – సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు నుండి మూడు కరివేపాకు రెమ్మలు, 3 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడినంత నూనె. స్పెషల్ మసాలా పేస్ట్ కోసం: 10 నుండి 12 పలుకుల జీడిపప్పు, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, అర స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర,  ఒక బిర్యానీ ఆకు, 7-8 దాల్చిన చెక్క ముక్క, యాలకులు,…

Read Full News

Hyderabad: వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి విచారించగా..

నగరంలో అక్రమంగా హ్యాష్‌ అయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ప్రాంతానికి చెందిన పొద్దు మోహన్‌రావు (41), డుంబ్రిగుడ మండలం పాతలంగి గ్రామానికి చెందిన టి. బిస్తుదాస్‌ (27)గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోహన్‌రావు వ్యవసాయంతో పాటు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్‌ దందాలోకి అడుగుపెట్టినట్లు పోలీసులు తెలిపారు….

Read Full News

ఓనం వేళ.. అమెరికాలో ఇద్దరి హత్య! వారితో కలిసుండే మహిళే నిందితురాలు!

 ఈ హత్యలు జరగడానికి కొద్ది రోజుల ముందే వీరు ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగా ‘ఓనం’ పండుగను జరుపుకున్నారు. అంతలోనే ఇలాంటి దారుణం జరగడాన్ని మృతుల కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. ఆగస్టు 28వ తేదీన కాలిఫోర్నియాలోని మిలిపిటాస్ లో కేరళకు చెందిన ఇద్దరు మహిళా టీచర్లు అంజన హరి, అన్ మేరీ మాథ్యూ దారుణ హత్యకు గురయ్యారు.  తోటి మహిళే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  వీరు ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో…

Read Full News

Video: వావ్.. 5శాతం నీటితో మేడపై 70శాతం కూరగాయల సాగు.. నటుడు మాధవన్ టెర్రస్ గార్డెన్ సీక్రెట్స్ తెలిస్తే..

నటనలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్. కొద్దిపాటి బాల్కనీ లేదా టెర్రస్ ఉంటే చాలు.. ఎవరైనా కెమికల్స్ లేని తాజా కూరగాయలను సొంతంగా పండించుకోవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. ముంబైలోని తన ఇంటి టెర్రస్‌పై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్న ఆయన, తమిళనాడులో భారీ కొబ్బరి తోటను సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2014లో బాల్కనీలో చిన్నపాటి కుండీలతో ప్రారంభమైన మాధవన్ వ్యవసాయ ప్రయాణం నేడు ఆయన జీవనశైలిలో…

Read Full News