జస్టిస్ డిలేడ్!.. కోర్టుల్లో 5 కోట్లకుపైగా పెండింగ్ కేసులు.. మరీ న్యాయం దక్కేదెప్పుడు?
ప్రస్తుతం మన దేశంలోని జిల్లా, కింది కోర్టుల్లోనే ప్రస్తుతం 5.18 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 4.05 కోట్లకు పైగా క్రిమినల్ కేసులు కాగా.. 1.12 కోట్లకు పైగా సివిల్ కేసులు ఉన్నాయి. అంటే కేసులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటిలో కొన్నింటికి త్వరగానే పరిష్కారం దొరుకుతోంది. మరికొన్ని మాత్రం ఏళ్ల తరబడి అలాగే నడుస్తున్నాయి. ఏళ్లుగా అదే పని.. కేసు మొదలైన తర్వాత వాయిదా పడటం. మళ్లీ మరో రోజు రావడం. ఆ…